Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holiday travel: న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా..? ఈ టిప్స్ పాటించడం మస్ట్..!

కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకడానికి ​‍ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ వేడుకలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి వివిధ ప్రణాళికలు వేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేక వెకేషన్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్‌ అనేది అందరికీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త ఆశలు, లక్ష్యాలు, నిర్ణయాలు తీసుకోవడానికి నాంది పలుకుతుంది.

Holiday travel: న్యూ ఇయర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారా..? ఈ టిప్స్ పాటించడం మస్ట్..!
New Year 2025
Follow us
Srinu

|

Updated on: Dec 24, 2024 | 2:59 PM

న్యూ ఇయర్‌ సంబరాల కోసం చాలామంది దూర ప్రాంతాలకు వెళతారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ చివరి వారంలో వివిధ ‍ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు చాలామంది కనిపిస్తారు. అయితే ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భం చాలా ప్రత్యేకంగా ఉండాలి. అక్కడ చేసుకున్న సంబరాలు జీవితాంతం గుర్తుండేలా చూసుకోవాలి. దాని కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకోవడం బాగున్నప్పటికీ.. మరీ అధికంగా బేరాలు ఆడడం సరికాదు. మీ ప్రయాణం మీ కుటుంబానికి, స్నేహితులకు మధుర జ్ఞాపకంలా మిగిలిపోయేందుకు కొన్ని చిట్కాలను పాటించాలి.

ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రభావం సమాజంపై విపరీతంగా ఉంటోంది. చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకూ దానిలోనే గడుపుతున్నారు. సాధారణంగా సోషల్‌ మీడియాలో మిత్రులు, సెలెబ్రెటీలు తాము పర్యటించిన వివిధ ప్రదేశాల ఫొటోలను పోస్టింగ్‌ చేస్తూ ఉంటారు. వాటిని చూసి, అక్కడకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోకూడదు. దీని వల్ల ఫొమో అనే భావన ఏర్పడుతుంది. అంటే ఇతర పొందుతున్న ఆనందం, అవకాశాలను తాము కోల్పోతున్నామని ఆందోళన కలుగుతుంది. దీనిలో పడితే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వెకేషన్‌ కోసం ఏ ప్రాంతానికి వెళ్లాలనే విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోండి. లేకపోతే మీరు ఎంపిక చేసుకున్న ప్రదేశం గురించి పూర్తిగా పరిశోధించండి. అ‍న్ని విషయాలు బాగున్నాయి అనుకున్నప్పుడు ట్రావెల్‌ ఏజెంట్‌ ను సంప్రదించండి. లేకపోతే ఆన్‌ లైన్‌ లో మీరే బుక్‌ చేసుకోండి.

హాలీడే గమ్యస్థానానికి ముందస్తు బుక్కింగ్‌ లు చేసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ముందుగానే ప్రణాళిక అమలు చేయాలి. వెళ్లాలనుకున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు అక్కడకు ట్రావెలింగ్‌, బస తదితర వాటిని చూసుకోవాలి. ఇలాంటి వాటిని ముందుగానే బుక్‌ చేసుకోవడం వల్ల అనుకూలమైన ధరలో అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ధరలు విపరీతంగా పెరిగిపోయి జేబులకు చిల్లులు పడతాయి. కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు పర్యాటకులతో కంటే స్థానికులతో గడపడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ట్రావెల్‌ ఏజెంట్‌ మీకు అందించే భోజనం కన్నా స్థానికంగా ఉండే వంటకాలను రుచి చూడండి. దీనివల్ల అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు మీకు తెలియడంతో పాటు కొత్త ఉత్సాహం వస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి