AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. వీనస్ పై వాతావరణ అధ్యయనానికి ఆపరేషన్

ఇస్రో(ISRO).. మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడు (Venus) గ్రహంపై శాటిలైట్స్ ను...

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. వీనస్ పై వాతావరణ అధ్యయనానికి ఆపరేషన్
Isro
Ganesh Mudavath
|

Updated on: May 05, 2022 | 6:49 AM

Share

ఇస్రో(ISRO).. మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలోకి పలు ఉపగ్రహాలను పంపి ఎన్నో రహస్యాలను ఛేదించిన ఇస్రో ఇప్పుడు మరో గ్రహంపై దృష్టి సారించింది. సౌరకుటుంబంలోనే అత్యంత ఉష్ణగ్రహంగా పిలిచే శుక్రుడు (Venus) గ్రహంపై శాటిలైట్స్ ను పంపించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ తెలిపారు. ఈ అంతరిక్ష ప్రయోగంపై ఇస్రో బుధవారం సుదీర్ఘ చర్చలు చేపట్టింది. అత్యంత తక్కువ సమయంలో శుక్ర గ్రహం చెంతకు మిషన్‌ చేపట్టడం భారత్‌కు సాధ్యమేనని.. ఆ సామర్థ్యం మనకు ఉందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే రిపోర్టు సిద్ధమైందని, నిధులు కూడా సమకూరాయని వివరించారు. భూమిపై ఉన్నట్టుగానే శుక్రుడుపై జంతుజాలానికి అనువైన వాతావరణం ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. రాను రాను వాతావరణంలో నెలకొన్న పరిస్థితులలో వీనస్.. అత్యంత ఉష్ణోగ్రత కలిగిన గ్రహంగా మారిందని అంటుంటారు. వీసస్ పై వాతావరణం ప్రమాదకరంగా ఉంటుందని, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ మేఘాలు ఉంటాయని చెబుతారు.

దీంతో వీనస్‌పై నెలకొన్న రహస్యాలను ఛేదించేందుకు అమెరికా సహా పలు దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇస్రో కూడా ఈ దిశగానే మిషన్‌ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. శుక్రుడి ఉపరితలంపై ఎలాంటి వాతావరణం ఉంది. ఇందుకోసం వీనస్ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు.. నాసా కూడా శుక్రుడి చెంతకు రెండు వ్యోమనౌకలకు పంపనుంది. ఇందుకోసం బిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చు నిధులను సమకూర్చుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి.

Viral Photo: ఈ ఫోటోలో సింహాన్ని కనిపెట్టండి చూద్దాం.. మొదటిగా చూసేదే మీ బలం.!

Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!