Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Dress: పెళ్లి వేడుకను స్పెషల్‌గా జరుపుకోవాలనుకున్న యువతి.. ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో డ్రెస్

24 Carat Gold Bride Dress: వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని..

Bride Dress: పెళ్లి వేడుకను స్పెషల్‌గా జరుపుకోవాలనుకున్న యువతి.. ఏకంగా 24 క్యారెట్ల బంగారంతో డ్రెస్
24 Carat Gold Dress
Follow us
Surya Kala

|

Updated on: May 05, 2022 | 7:53 AM

24 Carat Gold Bride Dress: వివాహ వేడుక అనేది ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన క్షణం. తమ పెళ్లి వేడుకను మరింత ప్రత్యేకంగా చేసుకోవడానికి, జీవితాంతం ఆ మధుర క్షణాలను గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలని వధూవరులు కలలు కంటారు.  ఇక పెళ్ళిలో అత్యంత అందంగా కనిపించాలని వధువు కలలు కంటుంది. అదే సమయంలో.. పెళ్లి వేడుకలో ధరించే దుస్తులు, నగలు, మేకప్ ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పెళ్లి కోసం ధరించే దుస్తుల ఎంపిక కూడా భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. తాజాగా ఓ వధువు (Bride Dress) డిఫరెంట్ గా కనిపించడం కోసం ఏకంగా బంగారం దుస్తులను ధరించింది. దీంతో పెళ్ళికి వచ్చిన ఆహుతులు ఆశ్చర్యపోయారు. ఇప్పడు ఆమె ధరించిన దుస్తులు నెట్టింట (internet) వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆ పెళ్లి కూతురు ధరించిన దుస్తులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

బంగారు గౌను ధరించిన వధువు ప్రతి వధువు తన పెళ్లి దుస్తులను గుర్తుంచుకోవాలని కోరుకుంటుంది. దీని కోసం, పెళ్లిలో వధువు తన దుస్తులపై చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. ఇది నిజమని నిరూపించడానికి, ఒక వధువు తన పెళ్లిలో 24 క్యారెట్ల బంగారు గౌను ధరించింది. వెడ్డింగ్ స్పెషల్ గా ధరించిన ఈ గోల్డ్ గౌనులో వధువు చంద్రబింబంలా మెరిసిపోతూ అందంగా కనిపించింది.

వధువు పేరు కైలా. 24 ఏళ్ల యువతి. మై బిగ్ ఫ్యాట్ అమెరికన్ జిప్సీ వెడ్డింగ్‌లో కనిపించిన కైలా.. టిమ్మీని వివాహం చేసుకుంది. తన పెళ్లి వేడుకను మరింత అందంగా మార్చుకోవడానికి కైలా గోల్డెన్ డ్రస్ ధరించింది. పెళ్లి కూతురు అత్తగారు కూడా గోల్డ్ గౌన్ ను ధరించమని సూచించింది. దీంతో ఈ డ్రెస్ ను తయారు చేసి బాధ్యతను ఫ్యాషన్ డిజైనర్ సోండ్రా సీలీకి అప్పగించారు. అంతేకాదు భారీగా ఖర్చు పెట్టారు కూడా. 24 క్యారెట్ల గోల్డ్ గౌను తయారీని ఛాలెంజ్ గా తీసుకున్న సౌంద్ర .. మనసు పెట్టి మరి ఈ డ్రెస్స్ ను డిజైన్ చేసింది.

తన పెళ్లి వేడుకక్కి.. బంగారం దుస్తులు ధరించి రాగానే పెళ్ళికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కైలాని చూస్తూ ఉండిపోయారు. ఇప్పటి వరకూ ఎవరూ బంగారంతో చేసిన గౌన్ ను ధరించక పోవడంతో వధువుని చూస్తూనే ఉండిపోయారు.  అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యి.. పెళ్లి కూతురునే చూస్తూ ఉండిపోయారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Tirupathi: శ్రీవారి భక్తులకు శుభవార్త..! నేటి నుంచే అందుబాటులోకి మెట్ల మార్గం

Gold & Silver Price Today: మహిళకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న పసిడి ధర, స్థిరంగా వెండి.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..