Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: బ్యాక్‌బెంచర్‌ సివిల్‌ ఇంజనీర్‌ అయితే ఇలాగే ఉంటుంది మరి.. నవ్వులే నవ్వులు..!

Funny Video: సాధారణంగా, క్లాస్‌లో ముందు కూర్చున్న వారు అన్ని అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే వారు జీవితంలో ముందుకు సాగగలరని..

Funny Video: బ్యాక్‌బెంచర్‌ సివిల్‌ ఇంజనీర్‌ అయితే ఇలాగే ఉంటుంది మరి.. నవ్వులే నవ్వులు..!
Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: May 05, 2022 | 6:00 AM

Funny Video: సాధారణంగా, క్లాస్‌లో ముందు కూర్చున్న వారు అన్ని అంశాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఎందుకంటే వారు జీవితంలో ముందుకు సాగగలరని నమ్ముతారు. ఇక చివరి బెంచ్‌లో కూర్చున్నవారిని ఒకరకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో చూస్తారు. ఎందుకంటే వారు జీవితంలో పనికిరారనే ఒక భావన కొందరిలో ఉండిపోతుంది. అయితే ఇవన్నీ ఊహలు మాత్రమే అని కొట్టిపారేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. తరగతి వెనుక కూర్చునే పిల్లల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. తాము కూడా భవిష్యత్తులో మంచి స్థానం సాధించగలమని, అయితే ప్రజలకు ఎవరు వివరించాలి. బ్యాక్‌బెంచర్‌లకు సంబంధించిన అనేక రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇవి చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

ఇంటి నిర్మాణం జరుగుతున్న తీరును ఈ వీడియోలో చూడవచ్చు. కొన్ని చోట్ల చెక్కలు విచ్చలవిడిగా ఉండటం కనిపిస్తుంది. ఇక కాంక్రీట్ మిక్సింగ్ యంత్రంలో సిమెంటు, ఇసుక, కంకర వేసి మిక్స్ చేస్తున్నారు. ఇంతలో నల్లకళ్లద్దాలు పెట్టుకున్న ఓ వ్యక్తి హఠాత్తుగా అక్కడికి చేరుకుని, రాగానే ఆ మెషీన్‌లోని కాంక్రీట్‌ను అదేదో వంటక అయినట్లుగా టేస్ట్ చూస్తాడు. ఏదో తక్కువైందని భావించి.. అందులో కాస్త ఇసుక వేస్తారు. ఆ తరువాత మళ్లీ టేస్ట్ చేసి ఓకే చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. అక్కడ జరిగేది ఇంటి నిర్మాణమైతే.. ఇతనొచ్చి అదేదో వంటకం చేస్తున్నట్లుగా టేస్ట్ చూసే ఓకే చేయడం నవ్వు తెప్పిస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఇంజనీర్లు కూడా ఉంటారా అంటూ ఫుల్‌గా నవ్వుకుంటున్నారు. బ్యాక్ బెంచర్ సివిల్ ఇంజనీర్ అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్__ధమాకా అనే ID పేరుతో షేర్ చేశారు. బ్యాక్‌బెంచర్ సివిల్‌ ఇంజనీర్‌గా మారినప్పుడు ఇలాగే జరుగుతుంది అని వీడియోపై కామెంట్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా అంటే 1 కోటి సార్లు వీక్షించారు. 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. నెటిజన్లు దీనికి ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

View this post on Instagram

A post shared by memes? (@memes__dhamaka)