Pakistan: దౌత్య బహుమతులను తన వద్దే ఉంచుకున్నారు.. ఇమ్రాన్ ఖాన్ పై షరీఫ్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు
పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవి నుంచి వైదొలగిన తర్వాత అధికారిక వాహనాన్ని తన వద్దే ఉంచుకున్నారని పాకిస్తాన్ సమాచార మంత్రి తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ బీఎమ్ డబ్ల్యూ- X5 కారు విలువ 150 మిలియన్ల పాకిస్తాన్ రూపీలు...
పాకిస్తాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవి నుంచి వైదొలగిన తర్వాత అధికారిక వాహనాన్ని తన వద్దే ఉంచుకున్నారని పాకిస్తాన్ సమాచార మంత్రి తెలిపారు. బుల్లెట్ ప్రూఫ్ బీఎమ్ డబ్ల్యూ- X5 కారు విలువ 150 మిలియన్ల పాకిస్తాన్ రూపీలు ఉంటుందని మరియమ్ ఔరంగజేబ్ చెప్పారు. ఇమ్రాన్ తనకు బహుమతిగా ఇచ్చిన తుపాకీని తన కోసం ఉంచుకున్నాడని ఆమె చెప్పారు. దేశ ఖజానాకు ఎటువంటి చెల్లింపులు చేయకండా దౌత్యపరమైన బహుమతులను తన వద్దే ఉంచుకున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ తన పదవీ కాలంలో ఇచ్చిన దౌత్య బహుమతులతో తనకు నచ్చిన విధంగా చేయడానికి హక్కు ఉందని వెల్లడించారు. స్టేట్‌క్రాఫ్ట్ పట్ల ఆసక్తి ఉన్న ఎవరికైనా.. దౌత్య బహుమతులు ఉంటాయన్నారు. 2009 లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌కు మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ బహుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. సాధారణంగా విదేశాల నుంచి వచ్చే బహుమతులు.. విలాసవంతమైనవిగా, అరుదైనవిగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రభుత్వాలు ఈ బహుమతులపై కఠినమైన నిబంధనలు విధించాయి. భారతదేశంలో అయితే దౌత్య బహుమతుల వివరాలను క్రమం తప్పకుండా వెల్లడిస్తారు. కొన్నిసార్లు ఈ బహుమతులను నాయకులు.. వారి స్వంత ఉపయోగం కోసం ఉంచుకోవడం, లేదా డబ్బు కోసం వాటిని విక్రయించడం వంటివి జరుగుతాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వద్ద.. మొత్తం 112 బహుమతులు, 142 మిలియన్ల పాకిస్తానీ రూపాయిలు ఉన్నాయని ఓ నివేదక వెల్లడించింది. రోలెక్స్ వాచ్, ఉంగరం, నెక్లెస్, బ్రాస్‌లెట్, చెవిపోగులు వంటి ఆభరణాలతో కలిపి ఇమ్రాన్ ఖాన్ దగ్గర ఉన్న మొత్తం వస్తువుల విలువ సుమారు 100 మిలియన్ల పాకిస్తాన్ రూపీల విలువ కలిగి ఉన్నట్లు అంచనా వేసింది. దౌత్య బహుమతుల వివాదానికి ప్రతిస్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్.. నా బహుమతి, నా ఎంపిక అని వ్యాఖ్యానించారు. తాను ప్రతి వస్తువుకు చట్టబద్ధమైన ధరను చెల్లించానని తెలిపారు. దౌత్యపరమైన బహుమతులను తిరిగి విక్రయించారనే ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన సమాధానంతో ఇస్లామాబాద్ హైకోర్టు సంతోషించలేదు. ఇమ్రాన్ ఖాన్ తన పదవీ కాలంలో అందుకున్న అన్ని బహుమతుల వివరాలను వెల్లడించాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
పాకిస్తాన్ లో చాలా మంది ఆర్మీ అధికారులు భారీగా పొలాలు కలిగి ఉన్నారు. వారు పదవీ విరమణ చేసినప్పుడు ప్రభుత్వం వారికి విస్తారమైన భూమిని ఇస్తుంది. ఈ క్రమంలోనే జనరల్ రహీల్ షరీఫ్‌కు పదవీవిరమణ అనంతరం ప్రభుత్వం 90 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించడం అప్పట్లో సంచలనంగా మారింది. అలాంటి కేటాయింపులు చట్టవిరుద్ధమని పాకిస్తాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఖాజీ ఫేజ్ ఈసా తీర్పునిచ్చారు. రహీల్ షరీఫ్.. సౌదీ రాజకుటుంబం నిధులతో సాయుధ దళానికి సారథ్యం వహించారు. వందలాది మంది రిటైర్డ్ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు సౌదీ, గల్ఫ్ మిలిటరీలలో పనిచేస్తున్నారు. కొత్త అవినీతి పరులు జాతీయ ఖజానాను ఖాళీ చేయడం ప్రారంభించారు. ఫలితంగా దేశంలో చక్కెర, పిండి కుంభకోణం ఏర్పడింది. ఫలితంగా పాకిస్తానీ వంటశాలల్లో రెండు ప్రధాన వస్తువులు కొరతగా మారాయి. వాటి ధరలను విపరీతంగా పెంచారు. అయితే పలువురు మంత్రులు, వ్యాపారవేత్తలు మాత్రం భారీగా లాభాలు పొందారు.
దౌత్య బహుమతులు తన వద్దే ఉంచుకున్నారన్న ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. నా బహుమతి- నా ఇష్టం అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. ఇలాంటి వివాదాలు ప్రజాదరణను దెబ్బతీస్తాయతి. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విలాసవంతమైన కార్లను విక్రయించిన ఇమ్రాన్.. రాజధాని ఇస్లామాబాద్ శివార్లలోని బనిగాలాలోని తన నివాసం మధ్య హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారని వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ఇస్లామాబాద్‌లోని కొత్త ప్రభుత్వం, పాకిస్తానీ సైన్యం, కరాచీలలో రికార్డు స్థాయిలో జనాన్ని ఆకర్షించిన ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలు.. ప్రస్తుతం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Beat The Heat: ఎండలోనూ చలిపుట్టిస్తోన్న ఆటో.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
Rahul Gandhi – OU Tour: రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఓయూ వీసీకి ఆదేశాలు..