ఐఫోన్ ప్రేమికులు గుడ్‌న్యూస్.. త్వరలో చౌకైన ఫోన్

TV9 Telugu

23 December 2024

ఐఫోన్ SE 4 గురించి చాలా కాలంగా వినిపిస్తోంది. ఇది Apple ఉత్పత్తుల్లో అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ కావచ్చంటున్నారు.

నివేదికల ప్రకారం, iPhone SE 4ని iPhone 16e పేరుతో ప్రారంభించేందుకు ఫ్లాన్ చేస్తుందట. ఇది iPhone 16 సిరీస్‌లో భాగం.

iPhone SE 4 పూర్తి ఎడ్జ్-టు-ఎడ్జ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇది మునుపటి SE మోడల్‌లకు భిన్నంగా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.1 అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు, ఆపిల్ SE సిరీస్‌లో మొదటిసారిగా టైప్-సి పోర్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇది మరింత ఆధునికంగా ఉంటుంది.

iPhone SE 4కి సంబంధించి అనేక లీక్‌లు వెలువడ్డాయి. అయితే Apple నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

iPhone 16e (SE 4) iPhone 16 సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్‌గా ఉంటుంది. ఇది బడ్జెట్‌లో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.

iPhone SE 4 అద్భుతమైన హార్డ్‌వేర్, కొత్త ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. Apple మునుపటి మోడల్ iPhone SE 3ని SE సిరీస్‌లో 2022 సంవత్సరంలో విడుదల చేసింది.

ఐఫోన్ ప్రేమికులు ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీని లాంచ్ Appleకి ఒక సంచలన కావచ్చంటున్నారు.