భారతదేశంలో ప్రధానమంత్రికి SPG భద్రత కల్పిస్తుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అనేది భారత ప్రధాన మంత్రిని కంటికి రెప్పలా కాపాడే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ.
1988లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన SPG ప్రధానమంత్రికి భద్రతను పర్యవేక్షిస్తూ వస్తోంది. ఎస్పీజీ భద్రత కోసం ప్రతిరోజు రూ.1.17 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఎస్పీజీ ప్రధానమంత్రికి మాత్రమే భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో ఎంత మంది SPG కమాండోలు ఉన్నారో తెలుసా?
SPG భద్రత అత్యంత కట్టుదిట్టమైనదిగా పరిగణిస్తారు. సాధారణంగా ప్రధాని భద్రత కోసం 24 మంది ఎస్పీజీ కమాండోలను నియమిస్తారు.
కానీ ఈ SPG భద్రత సంఖ్య ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.
SPG కమాండోలకు 4 స్థాయి భద్రత ఉంటుంది. వీళ్లు ఎల్లపుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తూ ప్రధాని రక్షణగా ఉంటారు.
ప్రధానమంత్రి రక్షణ కోసం SPG కమాండోలు ఎప్పుడు అప్ గ్రేడెడ్ ఆయుధాలను కలిగి ఉంటారు. ధ్యతలను నిర్వహిస్తారు.
SPG ఉపయోగించే ఆయుధాలలో FN P90 మెషిన్ గన్స్, FN హెర్స్టాల్ F2000 రైఫిల్స్, గ్లాక్ 17 ఆటోమేటిక్ పిస్టల్స్ ఉంటాయి.