ఐన్‌స్టీన్‌ ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని వదులుకున్నారా.?

TV9 Telugu

21 December 2024

ప్రసిద్ధ యూదు శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో తన ఆవిష్కరణలకు ప్రసిద్ధి.

శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా వచ్చిందని చాలామందికి తెలియని విషయం.

1952లో ఇజ్రాయెల్ మొదటి ప్రెసిడెంట్ చైమ్ వీజ్‌మాన్ మరణం తరువాత ఐన్‌స్టీన్‌కు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది.

అప్పటి ప్రధాని డేవిడ్ బెన్-గురియన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఐన్‌స్టీన్‌ను అధ్యక్ష పదవి చేపట్టాలని కోరింది.

1952లో ఇజ్రాయెల్ ప్రధాని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు ఈ ప్రతిపాదన చేశారు అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్-గురియన్.

ఐన్‌స్టీన్ అధికారిక విధులు నిర్వహించే సామర్థ్యం తనకు లేదని, సున్నితంగా ప్రెసిడెంట్ పదవిని వదలుకున్నారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదులతో బంధం చాలా బలమైనది. అయితే ఇజ్రాయెల్ అధ్యక్ష పదవికి తాను అర్హుడని భావించలేదన్నారు.

ఒకవేళ ఐన్‌స్టీన్‌ ఇజ్రాయెల్ అధ్యక్ష పదవిని స్వీకరించినా, పెద్దగా మార్పు ఉండేది కాదంటారు రాజకీయ నిపుణులు.