Watch Video: హే జస్సూ.. నువ్వు గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? యశస్వి జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో యువ ఆటగాడు జైస్వాల్ ఫీల్డింగ్ తప్పిదంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. జైస్వాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు.
మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగియగా, ఆతిథ్య జట్టు నుండి బలమైన ప్రదర్శన కనబరిచింది. అయితే ఈరోజు జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు జైస్వాల్ చేసిన తప్పిదంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. లైవ్ మ్యాచ్‌లో జైస్వాల్‌పై కోపంతో కెప్టెన్ రోహిత్ మాట్లాడిన మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. స్ట్రీట్ క్రికెట్ ఆడినందుకు జైస్వాల్‌ని రోహిత్ తిట్టడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.
స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే ఆస్ట్రేలియా తరపున బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, రోహిత్ మిడ్-ఆఫ్ మధ్య జైస్వాల్‌ను ఫీల్డింగ్‌లో ఉంచాడు. అయితే ఈసారి కాస్త దూరంగా ఉన్న జైస్వాల్ బంతి తన వద్దకు రాకముందే పైకి దూకాడు. ఇది చూసిన రోహిత్ శర్మ జైస్వాల్‌ని ‘ఏయ్ జస్సు, నువ్వు గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బ్యాట్స్‌మన్ బాల్ కొట్టే వరకు జంప్ చేయకు అని అరిచాడు. ఇది కాస్త స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్ళు తమ చేతులను మోకాళ్లపై ఉంచి కిందకు వంగి ఉంటారు. దీనివల్ల బంతిని డిఫెండ్ చేసే ప్రయత్నంలో బ్యాట్స్ మెన్ క్యాచ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫీల్డర్లు ఈ స్థానంలో నిలబడి బంతిని సులభంగా పట్టుకోవచ్చు. అయితే బంతి రాకముందే జైస్వాల్ లేచిసరికి రోహిత్‌కు కోపం వచ్చింది.
Stump Mic Gold ft. THE BEST, @ImRo45! 🎙️😂
The Indian skipper never fails to entertain when he’s near the mic! 😁#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW pic.twitter.com/1fnc6X054a
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
తొలిరోజు ఇలాగే సాగింది
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 68 పరుగులతో, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. జట్టు తరఫున శామ్ కొన్‌స్టాస్ 65 బంతుల్లో 60, ఉస్మాన్ ఖవాజా 121 బంతుల్లో 57, మార్నస్ లబుషానే 145 బంతుల్లో 72, స్టీవ్ స్మిత్ అజేయంగా 68 పరుగులు చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి