Sam Konstas: అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్.. ఐసీసీ చర్యలు తప్పవా?

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 4వ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే సామ్ కాన్స్టాస్ తనదైన ముద్ర వేశాడు. 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్‌లో ఓ పొరపాటు చేశాడు. ఓ అభిమాని కోరడంతో ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగాడు.

Sam Konstas: అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్.. ఐసీసీ చర్యలు తప్పవా?
Sam Konstas
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Dec 26, 2024 | 5:20 PM

ఇండియా ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. తొలిరోజు మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టుపై చేయి సాధించింది. 6 వికెట్లకు 311 పరుగులు చేయడంతో మరుసటి రోజు మరింత స్కోర్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలిరోజు టెస్టు అరంగేట్రం చేసిన సామ్ కొన్‌స్టాస్ తన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండు సిక్సర్లు బాదాడు. అలాగే 65 బంతుల్లో 60 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో సమర్ధవంతంగా ఆడిన శామ్‌ కాన్‌స్టాస్‌‌ స్పెషల్ ఆట్రాక్షన్‌గా మారాడు. దీంతో అభిమానులు తనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి కనబరిచారు. అతని ఇన్నింగ్స్‌ను చూసిన క్రీడాభిమానులు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

సామ్ కాన్స్టాస్ డగౌట్‌లో కూర్చుని ఒక చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఓ అభిమాని కోరడంతో ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ICC అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం, మ్యాచ్ జరిగే ప్రాంతంలో ఏ ఆటగాడు మొబైల్ వంటి ఏ పరికరాన్ని ఉపయోగించకూడదు. అంతేకాదు మ్యాచ్ జరుగుతున్న ప్రాంతం నుంచి అనుమతి లేకుండా బయటకు వెళ్లడం నిషేధం. మ్యాచ్ సమయంలో ఈ ప్రాంతం నుండి బయలుదేరడానికి అధికారిక అనుమతి అవసరం. సామ్ కాన్స్టాస్ ICC నిబంధనలను ఉల్లంఘించాడు.

ఎవరైనా ఆటగాడు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, అతనిపై చర్యలు తీసుకోవచ్చు. నిబంధనల ప్రకారం, ఆటగాడికి ఆర్థిక జరిమానా విధించవచ్చు. ఎందుకంటే అతను ఈ నిబంధనలను పట్టించుకోకుండా డగౌట్ వదిలి అభిమానుల వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ వాడాడు. అయితే ఈ విషయంపై ఐసీసీ ఇంకా స్పందించలేదు. ఈ మ్యాచ్‌లో సామ్ కాన్స్టాస్ విరాట్ కోహ్లీల మధ్య వివాదం జరిగింది. విరాట్ కావాలనే సామ్ కాన్స్టాస్‌ను కవ్వింటే చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఐసీసీ విరాట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. విరాట్ మ్యాచ్ ఫిజులో 20% కోత విధించింది. అలాగే 1 డిమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి