24 December 2024
Subhash
కొద్ది రోజుల తర్వాత Apple తన 3 iPhone మోడల్‌లను యూరోపియన్ యూనియన్లో విక్రయించదు. డిసెంబర్ 28 నుండి ఐరోపాలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ SE 3వ జనరేషన్ అమ్మకాలను నిలిపివేత.
డిసెంబర్ 28 నుంచి ఐరోపాలోని మొత్తం 27 దేశాల్లో యాపిల్ తమ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
EU 2022లో తన మొత్తం 27 దేశాల్లో విక్రయించే ఫోన్‌లు, కొన్ని ఇతర గాడ్జెట్‌లు USB-C పోర్ట్‌లను కలిగి ఉండాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం.
2023లో USB-C పోర్ట్‌తో iPhone 15ని ప్రారంభించింది. అదేవిధంగా ఆపిల్ క్రమంగా దాని అన్ని ఐప్యాడ్‌లలో USB-C పోర్ట్‌లను అందించడం ప్రారంభించింది.
స్విట్జర్లాండ్‌లో వాటి విక్రయాలు డిసెంబర్ 20 నుండి ఆగిపోవచ్చు. స్విట్జర్లాండ్ ఐరోపాలో భాగం కానప్పటికీ, దానిలోని అనేక చట్టాలు EU చట్టాల మాదిరిగానే ఉన్నాయి.
యూరప్, స్విట్జర్లాండ్‌తో పాటు, ఈ నిర్ణయం ఉత్తర ఐర్లాండ్‌లో కూడా ప్రభావం చూపుతుంది. ఇక్కడ కూడా ఈ మూడు మోడళ్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.
భారత్‌లో ఈ ప్రభావం ఉండదు. ఐఫోన్ 14 విక్రయం కొనసాగుతుంది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి కొనొచ్చు. భారత్ USB-C పోర్ట్‌కు సంబంధించి రూల్స్ తీసుకురావడాన్ని పరిశీలిస్తోంది.
వచ్చే ఏడాది జూన్ నుండి మన దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు USB-C పోర్ట్ తప్పనిసరి చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.