Stock Market: వడ్డీ రేట్ల పెంపుతో కుదేలైన స్టాక్ మార్కెట్లు.. 1307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్..
Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో మార్కెట్లు నష్టాల్లో కి జారుకున్నాయి. ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 57,124 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
Stock Market: ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్లో మార్కెట్లు నష్టాల్లో కి జారుకున్నాయి. ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 57,124 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 55,501 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. సాయంత్ర ట్రేడింగ్ ముగిసే సమయానికి 1307 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 55,669 పాయింట్ల వద్ద ముగిసింది. మరో కీలక సూచీ అయిన నిఫ్టీ ఉదయం 17,096 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీ 392 పాయింట్లు నష్టపోయి 16,677 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ(Nifty) సూచీ 16,624 వద్ద తన కనిష్ఠాన్ని తాకింది. మార్కెట్ల భారీ పతనం వెనుక ఈ రోజు రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం ప్రధాన కారణంగా నిలుస్తోంది. దేశంలో అధిక స్థాయిలో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో భాగంగా.. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు, సీఆర్ఆర్ 50 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. వడ్డీ రేట్లలో ఈ భారీ పెంపు నిర్ణయం వెలువడిన వెంటనే సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్లను కోల్పోయింది. ప్రధానంగా ఆటో, బ్యాంక్, ఎఫ్ఎమ్సీజీ, పవర్, మెటల్, రియల్టీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు సంబంధించిన సూచీలు 1 నుంచి 3 శాతం మేర నష్టపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెనెక్స్ సూచీలోని ఓఎన్జీసీ 3.77%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 2.61%, ఎన్టీపీసీ 0.73%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 0.07% మేర లాభపడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 5.11%, హిందాల్కొ 4.70%, జీ ఎంటర్టైన్ మెంట్ 4.54%, బజాజ్ ఫిన్ సర్వ్ 4.25%, టైటాన్ కంపెనీ 4.05%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.91%, బజాజ్ ఆటో 3.49%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 3.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.40%, డాక్టర్ రెడ్డీస్ 3.19% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
RBI Rate Hike: వడ్డీ రేట్లపై ఆర్బీఐ హఠాత్ నిర్ణయం.. సామాన్యులకు ఖరీదుగా మారనున్న రుణాలు..
You Tube: యూట్యూబ్ యాడ్స్ తో విసిగిపోయారా.. ఇలా చేస్తే ఆ బాధే ఉండదు