AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Education: దేశంలో అందని ద్రాక్షగా మారుతున్న ప్రైవేటు విద్య.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే..

Education: పిల్లల విద్య ప్రస్తుత కాలంలో భరించలేని భారంగా మారుతోంది. పెరుగుతున్న విద్యా ఖర్చులు పిల్లల భవితవ్యాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఈ తరుణంలో తల్లిదండ్రులు ఏమి చేస్తున్నారంటే..

Education: దేశంలో అందని ద్రాక్షగా మారుతున్న ప్రైవేటు విద్య.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే..
Private Schools
Ayyappa Mamidi
|

Updated on: May 04, 2022 | 8:35 PM

Share

Education: దేశంలోని లక్షల మంది తల్లిదండ్రులు 2020 నుంచి తమ పిల్లలను ప్రైవేట్ విద్యాలయాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చారు. మరి కొందరైతే ఎలైట్ స్కూళ్ల నుంచి తక్కువ ఖరీదైన పాఠశాలలకు మార్చారు. ప్రైవేట్ రంగంలోని పాఠశాల ఫీజులు పెరుగుదల కారణంగా మధ్య ఆదాయ కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా ప్రైవేట్ పాఠశాలలు ఈ ఏడాది ఫీజులు, ఇతర ఛార్జీలను 15% వరకు పెంచాయని దిల్లీ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అపరాజిత గౌతమ్ అన్నారు.

ప్రతిస్పందనగా దిల్లీ ప్రభుత్వం ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేసింది. స్కూళ్ల అకౌంట్లను ఆడిట్ చేస్తామని మాటిచ్చింది. అదే సమయంలో పాఠశాలల ఫీజుల పెంపును 10 శాతానికి పరిమితం చేయటాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ దీనిని సాధించటంలో తక్కువ విజయం సాధించింది. కోల్‌కతా నగరంలో దాదాపు 70 శాతానికి పైగా ప్రైవేట్ పాఠశాలలు గత నెలలో 20% వరకు ఫీజులను పెంచాయి. వీటిని నియంత్రించాలని, ఫీజుల పెంపును తగ్గించాలని పాఠశాలలపై ఒత్తిడి తేవాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

ఇలాంటి పరిస్థితులే నోయిడాలోనూ కనిపిస్తున్నాయి. అక్కడి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు పెరుగుదలను నిరసించారు. పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులు ద్రవ్యోల్బణం డేటాలో పూర్తిగా ప్రతిబింబించలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇంధనం వంటి వాటి ధరలను ఎదుర్కొంటున్న కుటుంబాలు.. రెండవ ద్రవ్యోల్బణంలో పెరుగుతున్న విద్యా ఖర్చులు భాగమని ఇండియా రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ అంటున్నారు. ప్రస్తుతం ఇవే పరిస్థితులు దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులు పెరుగుతున్న స్కూల్ ఫీజులతో తమ పిల్లలను తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Beat The Heat: ఎండలోనూ చలిపుట్టిస్తోన్న ఆటో.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Save Birds: పక్షుల దాహార్తిని తీర్చే సూపర్ ఐడియా ఇది.. సెల్యూట్ అంటున్న యానిమల్ లవర్స్..