AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET 2022: నీట్ -2022 పై సందిగ్ధత.. వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్..

మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు....

NEET 2022: నీట్ -2022 పై సందిగ్ధత.. వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్..
Neet Pg 2022
Ganesh Mudavath
| Edited By: Ravi Kiran|

Updated on: May 05, 2022 | 11:10 AM

Share

మే 21 న నిర్వహిస్తున్న నీట్-2022(NEET) ను వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. గతేడాది నీట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్ కు సిద్ధం కావడానికి సమయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు లేఖ రాశారు. గతేడాది నీట్ పరీక్ష నిర్వహించడంలో జాప్యం జరిగింది, సెప్టెంబరు 2021లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడిందని లేఖలో తెలిపారు. ఈ ఆలస్యం కారణంగా అభ్యర్థులు వారి కెరీర్‌లో ఒక సంవత్సరం కోల్పోయారని చెప్పారు. యూజీ, పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఓబీసీ కి 27%, ఓబీసీ అభ్యర్థులకు 10% రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టు కేసు కారణంగా నీట్ పీజీ – 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు లేఖలో జతచేశారు. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్ వస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అనేక రాష్ట్రాలు తమ రాష్ట్ర కౌన్సెలింగ్‌ను వాయిదా వేసుకోవడం లేదా నిర్వహించడం ద్వారా తామంతా అయోమయంలో ఉన్నామని మహిత మన్నవ అనే విద్యార్థిని ఆవేదన చెందారు. అందువల్ల తాము పరీక్షకు సన్నద్ధమయ్యే విషయంపై దృష్టి  సారించలేకపోతున్నామన్నారు. తమ పరిస్థితిని గమనించి.. పరీక్షను 8-10 వారాలకు వాయిదా వేయాలని కోరారు. వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్ (UDFA) కు విజ్ఞప్తి చేశారు. నీట్ పీజీ పరీక్షపై సలహాలు కోరుతూ.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) ట్విట్టర్ లో.. పోల్ నిర్వహించింది. ఈ పోల్ లో15,000 కంటే ఎక్కువ మంది పాల్గొన్నారు. వీరిలో దాదాపు 85% మంది NEET-PGని వాయిదా వేయాలని కోరారు.

 

మెడికల్ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ – 2022 మాత్రం మే 21న నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. శనివారం జరిగిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ – 2021 పరీక్ష, కౌన్సెలింగ్ ప్రక్రియ రెండూ ఆలస్యమైనందున ఈ సారి సరైన విధానంలో ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రాబోయే నీట్ పీజీ – 2022 పరీక్షకు సిద్ధం కావడానికి తగిన సమయం లేదని దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థులు అంటున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం కారణంగా నీట్ పీజీ పరీక్ష – 2022ను వాయిదా వేయాలని విద్యా్ర్థులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాలకు లేఖలు రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Rahul Gandhi: కాంగ్రెస్‌ పిటిషన్‌ డిస్మిస్‌.. ఓయూలో రాహుల్‌ సభపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు..

Beat The Heat: ఎండలోనూ చలిపుట్టిస్తోన్న ఆటో.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..