Rahul Gandhi: కాంగ్రెస్‌ పిటిషన్‌ డిస్మిస్‌.. ఓయూలో రాహుల్‌ సభపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు..

తెలంగాణ హైకోర్టులో కాంగ్రెస్‌ పిటిషన్‌ డిస్మిస్‌ అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటిషన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. రెండు రోజుల కిందట సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును..

Rahul Gandhi: కాంగ్రెస్‌ పిటిషన్‌ డిస్మిస్‌.. ఓయూలో రాహుల్‌ సభపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు..
Rahul Gandhi
Follow us

|

Updated on: May 04, 2022 | 8:57 PM

తెలంగాణ హైకోర్టులో(Telangana High Court ) కాంగ్రెస్‌ పిటిషన్‌ డిస్మిస్‌ అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో(smania University) రాహుల్‌(Rahul) సభకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు వేసిన పిటిషన్‌ హైకోర్టు తోసిపుచ్చింది. రెండు రోజుల కిందట సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఉస్మానియా యూనివర్శిటీ వీసీకి అప్లికేషన్‌ పెట్టుకోవాలని రెండు రోజుల కిందట సింగిల్‌ బెంచ్‌ జడ్జి సూచించారు. ఈనెల 7న రాహుల్‌ ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటించేందుకు కాంగ్రెస్‌ షెడ్యూల్‌ తయారుచేసింది. అయితే వీసీ నుంచి అనుమతి మాత్రం రాలేదు. దీంతో హైకోర్టును కాంగ్రెస్‌ నేతలు ఆశ్రయించారు. దీంతో కోర్టు వీసీని మరోసారి సంప్రందించాలని సూచించింది. దీంతో రేపు మరోసారి కాంగ్రెస్‌ నేతలు వీసీకి అప్లికేషన్‌ పెడతారా? అటు వీసీ కాంగ్రెస్‌ నేతల అప్లికేషన్‌ స్పందిస్తారా? అనేది చూడాలి. మరోవైపు ఇప్పటికే వీసీ సెలవులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదిలావుంటే.. రాజకీయాలకు వార్ సిటీగా మారింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్‌గాంధీ పర్యటనపై తమ నిర్ణయంలో మార్పు లేదని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ స్పష్టంగా చెప్పడంతో.. కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలోఅర్ధం కాని పరిస్థితి నెలకొంది.

రాహుల్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఓయూలోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌.. అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాస్తున్నట్టు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. వీసీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కాబట్టి సీఎం దగ్గరికే నేరుగా వెళ్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్‌ నేతలవి పగటి కలలే అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు. అసలు.. ఏ ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాలనుకుంటున్నారో రాహుల్‌ చెప్పాలంటూ నిలదీశారు మంత్రి ఎర్రబెల్లి.