AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో మీ ఇష్టం.. బోర్డ్ తీసుకురండి..

తెలంగాణలో పసుపు రాజకీయం మళ్లీ రాజుకుంటోంది. మూడేళ్ల నుంచి ఎప్పుడూ ఎంపీ అరవింద్‌ గురించి మాట్లాడని MLC కవిత ఫస్ట్‌టైమ్‌ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. అధర్మపురి అరవింద్‌ అంటూ విమర్శించారు.

MLC Kavitha: మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో మీ ఇష్టం.. బోర్డ్ తీసుకురండి..
Mlc Kavitha
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: May 04, 2022 | 5:16 PM

Share

హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ(BJP) నేతలు చేసిందేమీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) నిజామాబాద్​లో మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత ఆక్షేపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత అభ్యర్థించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథేచ్ఛగా పెంచారన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని కవిత గుర్తుచేశారు. అర్వింద్‌కు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

పసుపుకు మద్దతు ధర ఇస్తామని ఎంపీ అర్వింద్ చెప్పారు.. ఆ విషయం ఏమైందో ఇప్పుడు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో దీనిపై ఎప్పుడు మాట్లాడారు..? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్‌ పార్లమెంట్‌లో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడలేదు. మద్దతు ధర ఇవ్వమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు. అది ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు.

రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్నారు. ఆ విషయంలో పురోగతి ఏది? వీటిపై నిజామాబాద్‌ ప్రజలకు జవాబు చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమో అని మూడేళ్లు విడిచిపెట్టాం.. ఇక విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. మీరు ఢిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. మీ ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకోని వస్తారో.. ఏం చేస్తారో చేయండని కవిత తనదైన తరహాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

బాండు పేపర్‌లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తామంటూ హెచ్చరించారు. పసుపుబోర్డు కాకుండా రూ.కోటీ 92లక్షలతో స్పైస్‌ బోర్డు తెచ్చి.. ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారు. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఇవి కూడా చదవండి: Viral Video: రారా చూసుకుందాం.. నీ ప్రతాపమో.. నా ప్రతాపమో.. ఈ ఇద్దరి సీరియస్ ఫైటింగ్ వీడియో వైరల్

Good News: తెలంగాణలో 93శాతం మందిలో పెరిగిన యాంటీబాడీస్‌.. ICMR-NIN సర్వేలో వెల్లడైన ఆసక్తికర అంశాలు