Viral Video: ఈ పెళ్లికొడుకు డ్యాన్స్‌కి అందరు ఫిదా.. వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో అన్ని రకాల వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా

Viral Video: ఈ పెళ్లికొడుకు డ్యాన్స్‌కి అందరు ఫిదా.. వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!
Desi Groom Dance
Follow us
uppula Raju

|

Updated on: May 05, 2022 | 12:31 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో అన్ని రకాల వీడియోలు ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. వధూవరుల ఫన్నీ వీడియోలు, ఫంక్షన్‌లో జరిగిన సన్నివేశాలు, బరాత్‌లో జరిగే డ్యాన్సులు, స్నేహితుల కామెడీ సీన్లు తరచూ వైరల్‌గా మారుతాయి. ఎందుకంటే నెటిజన్లు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. పదే పదే చూస్తూ లైక్స్‌, కామెంట్స్‌ చేస్తారు. తాజాగా వివాహ వేడుకలో బరాత్‌కి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ రెస్పాన్స్‌ ఇస్తున్నారు. మీరు ఈ వీడియో చూస్తే చాలా ఎంజాయ్‌ చేస్తారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వరుడు బరాత్‌లో డ్యాన్స్‌ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో వరుడు హిందీ హీరో గోవింద నటించిన ఆంటీ నెంబర్ వన్‌ టైటిల్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేస్తాడు. గోవింద ఎలా డ్యాన్స్‌ చేసాడో వీడియోలో వరుడు కూడా అచ్చం అలాగే చేస్తాడు. దీంతో జనాలు అతడి డ్యాన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో సైకో_బిహారీ అనే పేజీ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొన్ని గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 5 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో వీడియోను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌..

IPL 2022: ఈ ఆర్సీబీ ప్లేయర్ చెన్నైని కోలుకోలేని దెబ్బతీశాడు.. ప్రత్యర్థి జట్లకి హెచ్చరికలు జారీ చేశాడు..!

UPSC Exam Calendar 2023: యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2023 విడుదల.. IAS, NDAతో సహా పలు పరీక్ష తేదీలను తెలుసుకోండి..!