AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ నిధులు వచ్చేశాయ్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. చెక్ చేస్కోండి..

పీఎం కిసాన్ లబ్దిదారులకు సూపర్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దీపావళి పండుగ వస్తున్న క్రమంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు గుజరాత్‌లో జరిగిన కార్యక్రమంలో 24వ విడత సొమ్మును ప్రధాని మోదీ స్వయంగా విడుదల చేశారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ నిధులు వచ్చేశాయ్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. చెక్ చేస్కోండి..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Oct 30, 2026 | 11:49 AM

Share

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ అందించింది. పీఎం కిసాన్ 24వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. గుజరాత్‌లో జరిగిన సభలో వీటిని రిలీజ్ చేశారు. దీంతో లబ్దిదారుల అకౌంట్లలో రూ.2 వేల చొప్పున జమ అయ్యాయి. తొలుత ఈ నిధులు బ్యాంకులకు అందుతాయి. అనంతరం బ్యాంకులు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రిలీజ్ చేస్తాయి. రైతులకు ఈ నిధులు అందటానికి కొద్ది సమయం పట్టే అవకాశముంది. మొత్తం 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,680 కోట్లు మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్‌కు ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినవారికి నిధులు అందనున్నాయి. కేవైసీ పెండింగ్‌లో ఉన్నవారికి నిధులు నిలిచిపోనున్నాయి. మళ్లీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తే నిధులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

మీకు పడ్డాయో.. లేదో చెక్ చేసుకోవడం ఎలా

–పీఎం కిసాన్ పోర్టల్‌ ఓపెన్ చేయాలి

-అనంతరం ఫార్మర్స్ కార్నర్‌లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఎంచుకోవాలి

-పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి

-పీఎం కిసాన్ పోర్టల్‌లో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి

-అనంతరం సబ్మిట్‌పై క్లిక్ చేయాలి

-ఇన్‌స్టాల్‌మెంట్ కేటగిరీలో 24వ ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి

-మీకు పీఎం కిసాన్ నిధులు పడ్డాయో.. లేదో తెలుస్తుంది

-సిస్టమ్‌లో అప్డేట్ కాడానికి కాస్త ఆలస్యం కావొచ్చు

మూడు విడతలుగా నగదు..

పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించింది. 2019 నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతీ ఏడాది రైతులకు రూ.6 వేల ఆర్ధిక సాయం అందిస్తోంది. వీటిని రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా జమ చేస్తోంది. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి జమ చేస్తోంది. ఇటీవల ఈ పథకాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. ఇందుకోసం రూ.3.15 కోట్ల కేటాయించింది. 23 విడతలుగా ఇప్పటివరకు రూ.4.47 లక్షల కోట్లు రైతులకు అందించింది. ఈ నగదును రైతుల తమ పంట పెట్టుబడి కోసం ఉపయోగించుకోవచ్చు. ఎరువులు, యంత్రాల కొనుగోలు, కూలీల ఖర్చులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.  ఈ స్కీమ్ వల్ల దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. వీరిలో మహిళా రైతులు కూడా లక్షలాది మంది ఉన్నారు. త్వరలో దీపావళి పండుగ రానున్న వేళ ఈ నిధులు అందటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us