IPL 2022 Purple Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్.. చాహల్‌కి కేవలం 3 వికెట్ల దూరంలో..!

IPL 2022 Purple Cap: బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. దీంతో ఐపీఎల్-2022

IPL 2022 Purple Cap: టాప్‌ 5లోకి దూసుకొచ్చిన ఆర్సీబీ బౌలర్.. చాహల్‌కి కేవలం 3 వికెట్ల దూరంలో..!
Vanindu Hasaranga
Follow us

|

Updated on: May 05, 2022 | 1:33 PM

IPL 2022 Purple Cap: బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. దీంతో ఐపీఎల్-2022 పాయింట్ల పట్టికలో టాప్-4 లోకి ప్రవేశించింది. ఫాఫ్ డు ప్లెసిస్ సారథ్యం వహించిన ఈ జట్టు ఇప్పుడు 11 మ్యాచ్‌లలో ఆరు విజయాలు, ఐదు ఓటముల తర్వాత 12 పాయింట్లను కలిగి ఉంది. బెంగళూరు విజయం తర్వాత పర్పుల్ క్యాప్ జాబితాలో కూడా మార్పులు సంభవించాయి. బెంగళూరు బౌలర్ వనిందు హసరంగా టాప్-5లోకి ప్రవేశించాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ దక్కుతుంది.

చెన్నైతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో హసరంగ 31 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. హసరంగ ఒక వికెట్ తీయవచ్చు కానీ ఈ వికెట్ చాలా ముఖ్యమైనది. మంచి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వాయ్‌ను అవుట్ చేశాడు. కాన్వాయ్ 37 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ తర్వాత హసరంగ టాప్-5లోకి ప్రవేశించాడు. ఐదో స్థానాన్ని భర్తీ చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఉమేష్ యాదవ్‌ను ఈ స్థానం నుంచి తప్పించాడు.

చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీని తర్వాత పటేల్ టాప్-10లోకి ప్రవేశించాడు. పటేల్ 10 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అతను పంజాబ్ కింగ్స్‌కు చెందిన రాహుల్ చాహర్‌ను ఈ నంబర్ నుంచి తప్పించాడు. అంతేకాదు పటేల్ ప్రదర్శన ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

పర్పుల్ క్యాప్ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పటికీ ముందంజలో ఉన్నాడు. చాహల్ ఇప్పటికీ నంబర్-1. చాహల్ 10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అతని తర్వాతి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. 9 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్‌కు 17 వికెట్లు దక్కాయి. పంజాబ్ కింగ్స్‌కు చెందిన కగిసో రబడ తొమ్మిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన టి. నటరాజన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌ చాహల్‌. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను హ్యాట్రిక్‌ సాధించాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

IPL 2022 Orange Cap: ఆర్సీబీ గెలిచినా టాప్‌ 5లో చోటు సంపాదించని డుప్లెసిస్.. నెంబర్‌ వన్‌గా బట్లర్‌కి తిరుగులేదు..!

Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!

Viral Video: ఈ పెళ్లికొడుకు డ్యాన్స్‌కి అందరు ఫిదా.. వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!