AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: తగ్గేదేలే అంటోన్న డేవిడ్‌ భాయ్‌.. పాత జట్టుపై ప్రతీకారంతో పాటు ఆ ప్రపంచ రికార్డును కూడా ఖాతాలోకి వేసుకున్నాడుగా..

DC vs SRH: ఐపీఎల్‌ 2022 టోర్నీలో భాగంగా గురవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ (DC vs SRH)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2022: తగ్గేదేలే అంటోన్న డేవిడ్‌ భాయ్‌.. పాత జట్టుపై ప్రతీకారంతో పాటు ఆ ప్రపంచ రికార్డును కూడా ఖాతాలోకి వేసుకున్నాడుగా..
David Warner
Basha Shek
|

Updated on: May 06, 2022 | 8:02 AM

Share

DC vs SRH: ఐపీఎల్‌ 2022 టోర్నీలో భాగంగా గురవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ (DC vs SRH)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David warner) సూపర్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఆరంభంలో నెమ్మదిగానే ఆడినప్పటికీ ఆ తర్వాత గేర్‌ మార్చి తన పాత జట్టు బౌలర్లను ఉతికారేశాడు. మొత్తం 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీ అవకాశాన్ని మిస్‌ చేసుకున్నప్పటికి టీ20 ఫార్మాట్‌లో ఓ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు వార్నర్‌. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా డేవిడ్‌ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన హాఫ్‌ సెంచరీ వార్నర్‌కు 84వది. తద్వారా క్రిస్‌ గేల్‌ (83 అర్ధసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. ఇక వార్నర్‌, గేల్‌ తర్వాత టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లి 77 హాఫ్‌ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 70 అర్ధసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 69 అర్ధ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

400 సిక్సర్లతో..

ఇవి కూడా చదవండి

ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనే మరో రికార్డు అందుకున్నాడు వార్నర్‌. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన డేవిడ్‌.. టీ 20 క్రికెట్‌లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్‌ గేల్‌ 1056 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ వరకు సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు వార్నర్‌. అయితే వరుస ఓటములు ఎదురుకావడంతో అతనిని మొదట జట్టు నుంచి తప్పించింది ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం. ఆతర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఐపీఎల్‌ ట్రోఫీని అందించిన వార్నర్‌తో సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై నెట్టింట్లో కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక ఆ ఆతర్వాత జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో వార్నర్‌ను 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిట‌ల్స్ సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Inter Exams 2022: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలు.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..

Gold & Silver Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..

Power Crisis: ప్రయాణికులకు అలెర్ట్‌.. 1,100 రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..