AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Crisis: ప్రయాణికులకు అలెర్ట్‌.. 1,100 రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..

Railway News: వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటన్నారా? టూరిస్ట్‌ ప్రాంతాలకు

Power Crisis: ప్రయాణికులకు అలెర్ట్‌.. 1,100 రైళ్ల రద్దు.. పూర్తి వివరాలివే..
Trains
Basha Shek
|

Updated on: May 05, 2022 | 9:01 PM

Share

Railway News: వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? ఫ్యామిలీతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటన్నారా? టూరిస్ట్‌ ప్రాంతాలకు రైళ్లలో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. సమ్మర్‌ వెకేషన్‌ ప్లాన్లు ఉంటే ముందుగానే ట్రాన్స్‌పోర్ట్‌ గురించి బాగా తెలుసుకోండి. లేదంటే తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయం.ఎందుకంటే దేశంలో విద్యుత్‌ కొరత సంక్షోభం తీవ్రతరమవుతోంది. ఈ కారణంగా మే నెలాఖరువరకు ఏకంగా 11 వందలకు పైగా రైళ్లకు బ్రేకులు పడనున్నట్లు తెలుస్తోంది. మే 24 వరకు ఈ సర్వీసుల రద్దు కొనసాగేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా విద్యుత్‌ కొరతతో ఇంతకుముందే 650 సర్వీసులను రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ఇండియన్‌ రైల్వేస్‌ (Indian Railways) పేర్కొంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ..

కాగా దేశంలో కరెంట్ సంక్షోభం రోజురోజుకు ఎక్కువవుతోంది. విద్యుత్ కొరతతో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కరెంట్ కోతలు తీవ్రంగా ఉంటున్నాయి. పరిశ్రమలకు ఏకంగా పవర్ హాలీడే ప్రకటిస్తున్నారు. మరోవైపు భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఇక దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉంటోంది. దీంతో డిమాండ్ కు సరిపడా కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. ఈక్రమంలో బొగ్గు రవాణాకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగానే రైల్వే శాఖ పవర్ ప్లాంట్లకు కోల్ ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలోనే బొగ్గును తరలించే గూడ్స్ రైళ్లకు లైన్ క్లియర్ చేస్తోంది. ఇందుకోసం భారీగా ఎక్స్ ప్రెల్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తోంది.. కాగా ముఖ్యంగా దిల్లీ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లోని విద్యుత్‌ కేంద్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో పలు రైల్వే జోన్లలో ప్రయాణికుల రైలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈనెల 24వ తేదీ వరకు దేశంలో వివిధన జోన్లకు సంబంధించి మొత్తం 11 వందల రైళ్లు నిలిచిపోనున్నాయి. రైల్వే శాఖ రద్దు చేసిన రైళ్లలో 500 ట్రిప్పుల ఎక్స్ ప్రెస్ మెయిల్ రైళ్లు, 580 ట్రిప్పుల ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. కాగా రద్దైన రైళ్లకు అనుగుణంగా ప్రయాణాలు పెట్టుకోవాలని రైల్వే శాఖ ప్రజలకు సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Chandrababu Naidu: అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పన్నులెక్కువ.. వైసీపీపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు.. 

DC vs SRH Live Score, IPL 2022 : సన్‌రైజర్స్‌పై కసిగా ఆడుతోన్న వార్నర్‌.. స్కోరెంతంటే..

Railway News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌ నుంచి ఆ నగరానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే.