AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KVs to admit kids: కేంద్రీయ విద్యాలయంలో వారికి నేరుగా అడ్మిషన్.. పూర్తివివరాలివే..!

Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను..

KVs to admit kids: కేంద్రీయ విద్యాలయంలో వారికి నేరుగా అడ్మిషన్.. పూర్తివివరాలివే..!
Kvs
Shiva Prajapati
|

Updated on: May 05, 2022 | 9:11 PM

Share

Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు నేరుగా ఉచిత ప్రవేశం కల్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) నిర్ణయించింది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద దేశ వ్యాప్తంగా అనాధ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని కేవీఎస్‌కు కేంద్రం ఆదేశాలను జారీ చేసిందని, దాని ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని కేవీఎస్ అధికారులు ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల సమగ్ర సంరక్షణ, రక్షణను చూసుకోవడం, ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును చూసుకోవడం జరుగుతుంది. ఉచిత విద్యను అందించడం ద్వారా వారిని శక్తివంతంగా చేయడం, 23 సంవత్సరాల వయస్సులో ఆర్థిక సాయం చేసి స్వయం సమృద్ధి కోసం వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

‘కోవిడ్ బాధిత పిల్లలు వారి వయస్సు ప్రకారం వివిధ తరగతులలో నేరుగా చేర్చడం జరుగుతుంది. వారికి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అందించడం జరుగుతంది. అలాగే వీరికి ట్యూషన్ ఫీజు, విద్యా వికాస్ నిధి ఛార్జీలు సహా మొదలైన వాటి నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ కేటగిరీ కింద అడ్మిషన్ సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ సిఫారసుపై సంబంధిత కేవీఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒక తరగతిలో కనిష్టంగా ఇద్దరు విద్యార్థులతో ఒక పాఠశాలకు గరిష్టంగా 10 మంది విద్యార్థులను జిల్లా మేజిస్ట్రేట సిఫారసు చేయొచ్చు.’ అని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి కేవీఎస్ అడ్మిషన్ మార్గదర్శకాలను సైతం సవరించడం జరిగిందన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, పెంపుడు తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలకు స్కూళ్లలో ప్రవేశం కల్పించడానికి అదనపు నిబంధన చేర్చడం జరిగిందని చెప్పారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద అడ్మిషన్ గురించి అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు కేవీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింగదన్నారు. ప్రాంతీయ కార్యాలయాలు తమ ప్రాంతాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులను సంబంధిత డీఎంలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. తద్వారా కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు స్కూళ్లలో ప్రవేశం కల్పించాలని ఉత్తర్వుల్లో దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీమ్ కింద నమోదు చేసుకున్న 4,058 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను కేవీఎస్‌కు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పంపించింది. ఈ పథకం కింద పిల్లల అడ్మిషన్స్ కోసం వాటాదారులతో సమన్వయం కోసం ప్రాంతానికి చెందిన అధికారి నోడల్ అధికారిగా నియమించడం జరుగతుంది. అయితే, భారత్‌తో పాటు ఖాట్మండు, టెహ్రాన్, మాస్కో లో కలిపి మొత్తం 1,240 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. 13 లక్షల మంది విద్యార్థులు, 48,314 మంది ఉద్యోగులు కేవీఎస్ కింద ఉన్నారు. దేశ వ్యాప్తంగా 25 కేవీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.