Soaking Mangoes: తినే ముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలో తెలుసా?.. సైన్స్ చెబుతున్న షాకింగ్ నిజాలివే..!

Soaking Mangoes: మామిడి పండు సీజన్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మామిడి పళ్లను ఎంతగానో ఇష్టపడుతారు. విభిన్నమైన వంటకాలను..

Soaking Mangoes: తినే ముందు మామిడి పండ్లను ఎందుకు నానబెట్టాలో తెలుసా?.. సైన్స్ చెబుతున్న షాకింగ్ నిజాలివే..!
Mangoes
Follow us

|

Updated on: May 05, 2022 | 5:56 AM

Soaking Mangoes: మామిడి పండు సీజన్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మామిడి పళ్లను ఎంతగానో ఇష్టపడుతారు. విభిన్నమైన వంటకాలను ప్రయత్నించడంతో పాటు.. మామిడి పళ్లను ఇష్టంగా ఆరడిస్తారు. అయితే, మామిడి పండ్లకు ఉండే మురికిని, ఆ పంటకు ఉపయోగించే రసాయనాలను వదలించుకోవడానికి వాటిని తినే ముందు నీటిలో నానబెట్టడం అనే సాధారణ పద్ధతిని మీరు గమనించే ఉంటారు. ఇది ఒక సాధారణ కారణం మాత్రమే. మామిడి పండ్లను తినడానికి ముందు నీటిలో నానబెట్టడం ఎందుకు ఉత్తమం అనేదానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైటిక్ యాసిడ్ వదిలించుకోవటం.. ఫైటిక్ యాసిడ్ ఆరోగ్యానికి మంచి, చెడు రెండింటినీ కలిగించే పోషకాలలో ఒకటి. యాంటీ న్యూట్రియంట్‌గా పరిగణించబడే ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం, ఇతర మినరల్స్ వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. తద్వారా ఖనిజ లోపాలను ప్రోత్సహిస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడిలో ఫైటిక్ యాసిడ్ అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది అనేక పండ్లు, కూరగాయలు, గింజలలో కూడా కనిపిస్తుంది. అయితే, మామిడిపండ్లను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అదనపు ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

వ్యాధులను నివారించడం.. మొటిమలు, తలనొప్పి, మలబద్ధకం, ఇతర ప్రేగు సంబంధిత సమస్యల వంటి అనేక చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. “పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటి నుండి వేడి తొలగిపోతుంది. డయేరియా వంటి దుష్ప్రభావాలు, మొటిమల వంటి చర్మ సమస్యలకు కారణం కాకుండా ఈ ప్రక్రియను అనుసరిస్తారు” అని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అశుతోష్ గౌతమ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

రసాయనాలను తొలగించడం.. పంటలను రక్షించడానికి ఉపయోగించే పురుగుమందుల ప్రభావాన్ని ఇది తొలగిస్తుంది. పురుగుమందులు విషపూరితమైనవి, శ్వాసకోశ సమస్యలు, అలెర్జీ, తలనొప్పి, కళ్ళు, చర్మంపై దురద, వికారం మొదలైన వివిధ దుష్ప్రభావాలను కలిగించే శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మామిడి పళ్లను నానబెట్టడం వలన ఆ దుష్ప్రభావాలన్నీ పోతాయి.

చల్లగా ఉంచడం.. మామిడికాయలు శరీర ఉష్ణోగ్రతను కూడా పెంచుతాయి. ఫలితంగా థర్మోజెనిసిస్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల, మామిడికాయలను కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి థర్మోజెనిక్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కొవ్వును విచ్చిన్నం చేస్తుంది.. మామిడి పండ్లలో ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాటిని నానబెట్టడం వల్ల ‘సహజ కొవ్వు బస్టర్‌’లుగా పని చేస్తాయి.