AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: బరువు త్వరగా తగ్గాలని భావిస్తున్నారా? అయితే, ఈ విధంగా వాకింగ్ చేయండి..!

Weight Loss Tips: మీరు నడక ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల మీ లక్ష్యాన్ని చేరుకుంటే సరిపోతుందని

Weight Loss Tips: బరువు త్వరగా తగ్గాలని భావిస్తున్నారా? అయితే, ఈ విధంగా వాకింగ్ చేయండి..!
Waking
Shiva Prajapati
|

Updated on: May 05, 2022 | 5:58 AM

Share

Weight Loss Tips: మీరు నడక ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రోజుకు 10,000 అడుగులు నడవడం వల్ల మీ లక్ష్యాన్ని చేరుకుంటే సరిపోతుందని అందరూ భావిస్తారు. కానీ, అదంతా వట్టి భ్రమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు చేసే ప్రాథమిక వ్యాయామ దినచర్యలో నడక ఎప్పుడూ ఒక భాగం మాత్రమే. అయితే, ఆ నడక నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే సరైన, విభిన్న పద్ధతులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. బరువు తగ్గడం కోసం నడక సాధారణమైనది, ప్రాథమికమైనది కాదు. ఇది మీ శరీరంలోని కండరాలను లక్ష్యంగా చేసుకుని, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే టెక్నిక్ అయి ఉండాలి. దాని ప్రభావాన్ని పెంచడం ద్వారా మీ సాధారణ నడక ప్రయోజనాలను సులభంగా మెరుగుపరచగల అనేక మార్గాలు ఉన్నాయి. అందుకే రోజువారీ నడకను ప్రభావవంతంగా చేయడం ద్వారా ఎక్కువ కేలరీలు కోల్పోయే మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్లో అండ్ ఫాస్ట్ వాకింగ్.. కాసేపు నెమ్మదిగా నడవడం, మరికాసేపు ఫాస్ట్‌గా నడవడం చేస్తుండాలి. దీనినే ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. ఈ స్పీడ్ అండ్ స్లో వాకింగ్.. మరింత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అంతేకాదు.. సరదాగా కూడా ఉంటుంది.

2. కొంత బరువును ఎత్తుకుని నడవాలి.. నడిచే సమయంలో కొంత బరువును ఎత్తుకోవడం వలన కండరాలపై ప్రభావం పడుతుంది. కొంత బరువును మోస్తూ నడిచినట్లయితే.. దాని ప్రభావం కండరాలపై పడి త్వరగా ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

3. ఎత్తైన ప్రాంతాల వైపు నడవడం.. చదునైన ఉపరితలంపై నడవడం, పరుగెత్తడం మీ హృదయ స్పందన రేటును పెంచుతుంది. మంచి వ్యాయామం కూడా అవుతుంది. మీరు అదే వేగంతో లేదా నెమ్మదిగా కదులుతున్నప్పటికీ సహజంగానే ఎత్తుపైకి వెళ్లడం వల్ల మీ నడక తీవ్రత పెరుగుతుంది. నిజానికి, ఇది లెగ్ కండరాలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది.

4. ఇతర వ్యాయామాలు.. పుష్-అప్‌లు, వాకింగ్ ప్లాంక్‌లు, సింగిల్-లెగ్ హోపింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలు చేయాలి. వాకింగ్ తరువాత కాసేపు ఇవి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.