Liquor Dealers Strike: మద్యం ప్రియులకు భారీ షాక్.. 15 రోజులపాటు మద్యం వ్యాపారుల సమ్మె..!
Liquor Dealers Strike: మద్యం వ్యాపారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు.
Liquor Dealers Strike: మద్యం వ్యాపారులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు మద్యం వ్యాపారులు. మే 06వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగుతుందని రాష్ట్ర మద్యం వ్యాపారుల సంఘం ప్రధాన కార్యదర్శి గోవిందరాజ్ హెగ్డే ప్రకటించారు. డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోళ్లను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కేఎస్‌పీసీఎల్ ఎండీ తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖా మంత్రి కనీసం కలిసే ఛాన్స్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. డివిజన్ స్థాయిలో మద్యం కొనుగోలును నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. హోసాపేట్, బెల్గాం, మైసూర్‌లోని మంగళూరు సెక్షన్‌లో మద్యం లేదన్నారు. మే 19వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర పోరాటాలు సాగిస్తామని చెప్పారు లిక్కర్ డీలర్స్.
ఏ రోజు ఎక్కడ సమ్మె చేస్తారు.. మే 6వ తేదీన గుల్బర్గా డివిజన్ జిల్లాలు బీదర్, గుల్బర్గా, రాయచూర్, యాదగిరి. మే 10న హోసపేట డివిజన్‌లోని జిల్లాలు బళ్లారి, చిత్రదుర్గ, దావణగెరె, గడగ్, కొప్పల్, బెల్గాం జిల్లాలు బాగల్‌కోట్, బెల్గాం, బీజాపూర్, ధార్వాడ్, హావేరి. మే 12న మైసూర్ డివిజనల్ జిల్లాలు మైసూర్, చిక్కమగళూరు, హాసన్, మాండ్య, మంగళూరు జిల్లాలు దక్షిణ కన్నడ, కొడగు, శివమొగ్గ, ఉడిపి, ఉత్తరకన్నాడ్. మే 17న బెంగళూరు జిల్లాలు, బెంగళూరు రూరల్, చిక్కబల్లాపూర్, కోలార్, రామనగర్, తుమకూరు. మే 19న బెంగళూరు సిటీ డివిజన్‌లో సమ్మె చేస్తామని చెప్పారు.