AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ బామ్మో.. రష్మికను మించిపోయిందిగా.. వృద్ధురాలి డ్యాన్స్ చూస్తే పూనకాలే ఇక..!

Viral Video: ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో 60 ఏళ్ల వయసు దాటిందంటే వృద్ధా్ప్య చాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకు వారి జీవన శైలి కారణం.

Viral Video: అమ్మ బామ్మో.. రష్మికను మించిపోయిందిగా.. వృద్ధురాలి డ్యాన్స్ చూస్తే పూనకాలే ఇక..!
Dance
Shiva Prajapati
|

Updated on: May 05, 2022 | 7:40 PM

Share

Viral Video: ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో 60 ఏళ్ల వయసు దాటిందంటే వృద్ధా్ప్య చాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకు వారి జీవన శైలి కారణం. ఇక ఏడు పదుల వయసు దాటిన వృద్ధులు తమ పనిని తామే చేసుకోలేని స్టేజ్‌లో ఉంటారు. ఊతకర్ర సాయం గానీ, మరొకరి సహాయ సహకారాలు గానీ లేకుంటే పనులు చక్కబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. సాధారణ ప్రజల్లో ఉండే ఇలాంటి అభిప్రాయాన్ని ఓ వృద్దురాలు పటాపంచల్ చేసింది. కళ్లు చెదిరే యాక్టివిటీతో.. అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. ఆమె స్టామినా చూసి నెటిజన్లు అవాక్కయ్యారు.

పుష్ప సినిమా ఫీవర్ ఇప్పటికీ జనాలను వదలడం లేదు. సామాన్య ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు ఆ సినిమా డైలాగ్స్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ‘తగ్గేదే లే’ అనే డైలాగ్, ‘సామీ సామీ’ అనే పాట ఇంటర్నేషనల్‌ వైడ్‌గా ఫేమస్ అయ్యింది. చాలా దేశాలకు చెందిన ప్రజలు ఆ పాటకు డ్యాన్స్ చేయడం, ఆ డైలాగ్‌ చెబుతూ ఫోజు ఇవ్వడం, పుష్ప సాంగ్స్‌కి డ్యాన్స్ చేయడం వంటివి చేశారు. సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా.. ఆ క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తాజాగా ఓ దేశీ వృద్ధురాలు.. పుష్ప సినిమాలోని ‘సామీ సామీ’ రిమిక్స్ డీజే పాటకు డ్యాన్స్ ఇరగదీసింది. పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్‌ను మైమరపిస్తూ.. పుష్ప సినిమాలో రష్మిక మందన డ్యాన్స్‌ను బీట్ చేస్తూ.. దుమ్ము రేపింది. ఆమె వేస్తున్న ఒక్కో స్టెప్పు చూస్తే గూస్‌బమ్స్ రావడం ఖాయం.

ఇవి కూడా చదవండి

చూడటానికి బక్క పలచగా ఉన్న ఆ వృద్ధురాలు.. తనదైన స్టైల్‌లో ‘సామీ సామీ’ పాటకు స్టెప్పులేసి సూపర్ అనిపించుకుంది. వయసు కేవలం సంఖ్యకు మాత్రమే, మనసుకు కాదని నిరూపించింది. వృద్ధురాలి డ్యాన్స్‌ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆమె డ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆ డ్యాన్స్ చూసి ఏం ఎనర్జీ సామీ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. దానికి వేలాది వ్యూస్, లైక్స్ వస్తున్నారు. ఆ బామ్మ డ్యాన్స్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)