దేశంలో 10 కోట్ల ఉద్యోగాలున్నా.. నైపుణ్య యువత కొరత: AICTE

దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగాలున్నా అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువత అందుబాటులోలేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కో అర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్‌..

దేశంలో 10 కోట్ల ఉద్యోగాలున్నా.. నైపుణ్య యువత కొరత: AICTE
Skill Development
Follow us
Srilakshmi C

|

Updated on: May 05, 2022 | 9:40 PM

Lack of skills in the youth of the country: దేశవ్యాప్తంగా 10 కోట్ల ఉద్యోగాలున్నా అవసరమైన నైపుణ్యాలు ఉన్న యువత అందుబాటులోలేదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) కో అర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్‌ తెలిపారు. విజయవాడలో మే 4న‌ పరిశ్రమల ప్రతినిధులు, నిపుణులు, సెక్టార్‌ స్కిల్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, అధ్యాపకులతో నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ‘పరిశ్రమలతో విద్యా విధానాన్ని అనుసంధానం చేస్తే యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. నైపుణ్య శిక్షణ పాఠ్య ప్రణాళిక అభ్యర్థులకు అర్థమయ్యేలా ఉండాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో ఇప్పటికే ఏఐసీటీఈ శిక్షణ ఇస్తోంది’ అని వెల్లడించారు.

సంస్థ ఎండీ, సీఈవో పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ప్రతి శాసనసభ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. 86 నియోజకవర్గాల్లో 117 స్కిల్‌ హబ్స్‌ కేంద్రాలను గుర్తించాం. వీటిని 194 పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నాం. 185 నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకువస్తాం’ అని వివరించారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. శిక్షణ తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యువతను సిద్ధం చేసేందుకు పరిశ్రమల సహకారం అవసరమని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు.

Also Read:

NFSU Recruitment 2022: నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ 332 ఫ్యాకల్లీ పోస్టులు.. పూర్తి వివరాలు..

టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
టీపొడిని కూడా వదలరేంట్రా !! నకిలీ టీపొడిలో ఏమేం కలుపుతారో తెలుసా
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా ?? ఇలా కంట్రోల్‌ చేయండి !!
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
లాటరీలో రూ. 20 కోట్లు గెలిచిన మహిళ.. తల్లకిందులైన జీవితం..
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
కోట్లు పలికిన ప్రతిమను తలుపు అడ్డుగా వాడుకున్న జనం
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
వయస్సు 26 కేసులు 23.. వదిలేస్తే ఇంకేమైనా ఉందా ??
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్