Inter Exams 2022: మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల (Inter hall tickets)ను ఆయా ఇంటర్ బోర్డులు (Inter Board) జారీ చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో మరికాసేపట్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల (Inter hall tickets)ను ఆయా ఇంటర్ బోర్డులు (Inter Board) జారీ చేశాయి. ఏపీలో మే 24 వరకు పరీక్షలు జరగనుండగా..తెలంగాణలో (మే23 వరకు) ఒక్కరోజు ముందే పరీక్షలు పూర్తి కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 9,14,423 మంది పరీక్షలు రాయనున్నారు. అదేవిధంగా 87,435 మంది వృత్తి విద్య పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కూడా మొత్తం 9,07,393 విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,443 కేంద్రాలు సిద్ధంచేశారు. కాగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షల కోసం ఇరు రాష్ట్రాల్లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక తెలంగాణలో నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. సరైన టైంకు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది.
విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలివే..
*విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలి.
* నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* మొబైల్స్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు.
* విద్యార్థులకు ఆన్సర్ షీట్ ఇవ్వగానే దానిపై ఉన్న నియమాలు, నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్, ఓఎంఆర్ షీట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్ ఒకటేనా? కాదా? అన్నది విద్యార్థులు కచ్చితంగా సరి చూసుకోవాలి. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
*విద్యార్థులు సమాధానపత్రాలపై పేరు, రిజిస్ట్రేషన్ నంబర్లు లాంటి వివరాలను అస్సలు రాయవద్దని బోర్డు సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: