Ravi Teja: మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. వాల్తేరు వీరయ్య మూవీలో ఆ పాత్రలో కనిపించనున్న రవితేజ

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైనప్ చెప్పి .. షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు  వచ్చిన చిరు.

Ravi Teja: మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. వాల్తేరు వీరయ్య మూవీలో ఆ పాత్రలో కనిపించనున్న రవితేజ
Raviteja And Megastar Chira
Follow us
Rajeev Rayala

|

Updated on: May 06, 2022 | 6:58 AM

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వరుస సినిమాలను లైనప్ చెప్పి .. షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు  వచ్చిన చిరు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమా దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంలో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సల్మాన్ కలిసి ఓ మాస్ సాంగ్ కు స్టెప్పులేయనున్నారట. ఈ పాటను స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్.

ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత  బాబీ దర్శకత్వంలో ఓ మాస్ మసాలా మూవీ చేయనున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో మాస్ మహారాజ రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా రవితేజ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. రీసెంట్ గా రవితేజ క్రాక్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా పాత్రలో కనిపించనున్నాడట మాస్ రాజా .. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

RRR Movie: ఏ మాత్రం తగ్గని ఆర్ఆర్ఆర్ జోరు.. మరో వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్ చేసిన జక్కన్న..

Suma Kanakala: మాకు అసలు విడాకుల ఆలోచనే రాలేదు.. ఇకపై కూడా.. యాంకర్ సుమ కామెంట్స్ వైరల్..