Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్... టక్ జగదీష్.. వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Aishwarya Rajesh: డ్రైవర్‏గా మారిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..
Aishwarya Rajesh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2022 | 9:51 PM

తమిళ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్… టక్ జగదీష్.. వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అద్భుతమైన నటనతో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఈ చెన్నై సుందరి. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యింది ఐశ్వర్య. విలక్షణమైన పాత్రలలో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘డ్రైవర్ జమున’ (Driver Jamuna) పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిన్ స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్ బ్యానర్ పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు.

తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు “డ్రైవర్ జమున” ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ముఖం మీద చెమటలు, రక్తం మరకలతో ఫిరోషియస్ గా కనిపించారు ఐశ్వర్య రాజేష్. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ ఈ పాత్ర కోసం చాలా మంది లేడీ క్యాబ్ డ్రైవర్లని కలసి వారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేచురల్ గా ఈ పాత్రకు సిద్ధమైయ్యారు. సాధారణంగా రోడ్ మూవీస్ ని బ్లూ మ్యాట్ టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరిస్తారు. ఐతే ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్ను ఎటువంటి డూప్ ను లేకుండా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా వుండే విధంగా స్వయంగా రోడ్లపై కారుని నడిపారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. షూటింగ్ చివరిదశలో వున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Viral Photo: చిలిపి కళ్ల బుజ్జాయి.. లేత బుగ్గల పాపాయి.. ఈ చిన్నారి ఇప్పుడు అందాల సోయగం.. ఎవరో గుర్తుపట్టారా ?..

KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..