Viral Photo: చిలిపి కళ్ల బుజ్జాయి.. లేత బుగ్గల పాపాయి.. ఈ చిన్నారి ఇప్పుడు అందాల సోయగం.. ఎవరో గుర్తుపట్టారా ?..

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. తమిళ్

Viral Photo: చిలిపి కళ్ల బుజ్జాయి.. లేత బుగ్గల పాపాయి.. ఈ చిన్నారి ఇప్పుడు అందాల సోయగం.. ఎవరో గుర్తుపట్టారా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2022 | 7:38 PM

పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. తమిళ్, మలయాళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.. ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడు నటించిన సినిమా తెలుగులోకి డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది. అంతేకాకుండా.. ఇప్పుడు తెలుగులో నేరుగా సినిమా చేస్తుంది. స్టార్ హీరో సరసన ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. ఇప్పటికే విడుదలైన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎవరో గుర్తుపట్టండి.

ఆ చిన్నారి ఎవరో కాదండి.. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్. తమిళ్ స్టార్ హీరో ఆర్య సరసన రాజా రాణి సినిమాలో నటించింది ఈ అమ్మడు.. తెలుగులో డబ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో తెలుగులోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది నజ్రియా. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన అంటే సుందరానికీ ఈ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. 2014లో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‏ను ప్రేమ వివాహం చేసుకుంది నజ్రియా. ఫహద్ ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.. వీరిద్దరు కలిసి బెంగుళూర్ డేస్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్ధరి మధ్య పరిచయమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..