AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా హావా కొనసాగుతుంది. రాకింగ్ స్టార్ యశ్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్

Ram Gopal Varma: కేజీఎఫ్ దర్శకుడిపై ప్రశంసలు కురిపించిన ఆర్జీవి.. నువ్వు ఇండస్ట్రీకి వీరప్పన్ లాంటివాడివంటూ..
Rgv
Rajitha Chanti
|

Updated on: May 05, 2022 | 2:46 PM

Share

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా హావా కొనసాగుతుంది. రాకింగ్ స్టార్ యశ్ (Yash), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. హిందీలో కేజీఎఫ్ 2 చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోని యాక్షన్స్ సీన్స్.. యశ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యశ్ నటనపై.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంపై ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వాన్ని పొగడ్తలతో ముంచేత్తారు.

బుధవారం దర్శకుల దినోత్సవం సందర్భంగా రామ్ గోపాల్ వరుస వరుస ట్వీట్స్ చేశారు. ” ప్రశాంత్ నీల్ .. నువ్వు భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్ లాంటివాడివి. కేజీఎఫ్ సినిమాతో కన్నడ మాత్రమే కాదు.. తమిళ్, తెలుగు, హిందీలో ప్రతి డైరెక్టర్ మనసులను దోచేశావు.. నీకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు. కేజీఎఫ్ 2 సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యిందో తెలియక.. చాలా మంది రీషూట్, రీడ్రాఫ్ట్ చేస్తూ టన్నుల కొద్ది డబ్బులు వృధా చేస్తున్నారు. ఇండస్ట్రీలోని 95 శాతం మంది సంప్రదాయమైనవారికి నీ సినిమా నచ్చలేదు.. పాత చిత్రపరిశ్రమను నెట్టేసి.. కొత్త సినీ పరిశ్రమకు జీవం పోశావు.. అదే కేజీఎఫ్ 2 ” అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవి..

ట్వీట్స్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Yashoda: ఆకట్టుకుంటున్న యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ రెండు పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal : షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ కాజల్.. షాక్ లో అభిమానులు.

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..