Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..

Ram Charan Luxury House: టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటనకు అభిమానులు..

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం..
Ram Charan Luxury House
Follow us

|

Updated on: May 05, 2022 | 11:49 AM

Ram Charan Luxury House: టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తో బిజిబిజిగా ఉన్నాడు. అయితే తాజాగా రామ్ చరణ్ కొన్న కొత్త ఇల్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్ ఓ విలాసవంతమైన అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఇల్లుని కొనుగోలు చేశాడు. ఈ భవనం అతి సుందరమైన డిజైన్‌లు, సాంప్రదాయానికి నెలవుగా నిలుస్తుంది.

ఈ మెగా మాన్షన్ 25000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అన్ని ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ అల్ట్రా విలాసవంతమైన రాజభవన భవనం కోసం రామ్ చరణ్ 30 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సమాచారం. పలు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం..  గృహప్రవేశ వేడుక కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఇల్లు ఆంధ్రా చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన అలంకరణలు చేసినట్లు తెలుస్తోంది.

విశాలమైన ఎస్టేట్‌కు దారితీసే డ్రైవ్ వే రెండు వైపులా నీడనిచ్చే చెట్లు, పూల మొక్కలతో నిండి అందంగా ఉంది. చాలా ఖరీదైన పెయింటింగ్స్ తో భవనం గోడలను అలంకరించారు. అద్భుతమైన లైట్ ఫిట్టింగ్‌లతో భవనానికి అదనపు అందాన్ని తీసుకొచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ ఫ్లోరింగ్ వర్క్‌లతో కూడిన ప్రత్యేక గది .. చదరంగం బోర్డు వలె కనిపిస్తుంది. ఈ భవనంలో చిరంజీవికి ఇష్టమైన గదిగా తెలుస్తోంది. ఈ రూమ్ లో మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ గదిలో ఆభరణాల తయారీకి ఉపయోగించే పచ్చ రంగు రాయి కూడా కనిపిస్తోంది. ఈ సంప్రదాయం పురాతన కాలంలో..  చైనీ  రాజులు పచ్చటి రాయి ప్రమాదాల నుండి కాపాడుతుందని నమ్మేవారు. ఆ సంప్రదయం ఇప్పుడు రామ్ ఇంట్లో కనిపించడం విశేషం.

నేలమాళిగలోని ప్రార్థనా గది కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. పురాతన దేవాలయాల శైలిలో రాతితో నిర్మించబడింది. దేవుడికి పూజ, ధ్యానం కోసం ఇక్కడ ఈ స్థలం కేటాయించారు. అంతేకాకుండా, భవనంలో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఆధునిక వ్యాయామశాల కూడా ఉన్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో  రామ్ చరణ్ (@alwaysramcharan) షేర్ చేసిన పోస్ట్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Jai Bhim: ముదురుతున్న జై భీమ్ వివాదం.. హీరో సూర్యకు షాక్ ఇచ్చిన కోర్టు..

Aamalapuram: కోనసీమలో భానుడు భగభగలు.. తారు రోడ్లు సైతం కరిగిపోతున్న వైనం.. కారణం అదేనా?

ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
ఎవరూ ఊహించని ప్లేస్‌లో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్‌ఈవెంట్..
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
అమెరికా ఏమాత్రం సరితూగలేనంత బంగారం మనదేశంలో..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
వీరికి దూరంగా ఉండండి.. లేకపోతే మీ జీవితం నాశనం అవ్వడం ఖాయం..!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
'టెట్‌' ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కారణం ఇదే!
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
పచ్చిది ఇదేం చేస్తుందిలే అనుకునేరు.. ఇది తెలిస్తే మైండ్ బ్లాంకే..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి