Amalapuram: కోనసీమలో భానుడు భగభగలు.. తారు రోడ్లు సైతం కరిగిపోతున్న వైనం.. కారణం అదేనా?
Amalapuram: అందాల సీమ కోనసీమ(Konaseema).. ఇసుక తిన్నెలు, గోదావరి పరవళ్లు, కొబ్బరి తోటలు, ప్రకృతి అందాలతో చూపరులను ఆకట్టుకునే ప్రాంతం.. సహజ సౌందర్యాలకు నెలవైన కేరళకు..
Amalapuram: అందాల సీమ కోనసీమ(Konaseema).. ఇసుక తిన్నెలు, గోదావరి పరవళ్లు, కొబ్బరి తోటలు, ప్రకృతి అందాలతో చూపరులను ఆకట్టుకునే ప్రాంతం.. సహజ సౌందర్యాలకు నెలవైన కేరళకు(Kerala) ఏ మాత్రం తీసిపోని కోనసీమలో ఎండలు మండిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వేసవిలో చండ ప్రచండ ఉష్ణోగ్రతలతో కోనసీమలో భానుడి భగభగ మండిపోతున్నాడు. ఎంతగా ఎండలు ఉన్నాయంటే.. ఎండ వేడికి తయారు రోడ్లు సైతం కరిగిపోతున్నాయి.
పచ్చని కోనసీమ జిల్లాలో ఎండ వేడికి, వేసవి తాపంతో భగభగ మండిపోతుంది. జిల్లాలోని ప్రముఖ పట్టణం అమలాపురంలో ఎండ వేడికి రోడ్లపై ఉన్న తారు కరిగిపోతుంది. ఉదయం 9 గంటలకే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కరెంట్ కోతలు.. మరోవైపు వేసవి తాపం, ఉక్కపోతలతో ప్రజలు అల్లడిపోతున్నారు. కోనసీమలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడికి అమలాపురంలో ఏకంగా రోడ్లు సైతం కరిగిపోతున్నాయి. రోడ్డుపై తారు కరిగిపోతునందున.. ఆ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాల టైర్ల బాటలు పడుతున్నాయి. ఒకప్పుడు పగలు ఎండలు ఉన్నా.. సాయంత్రం అయ్యేకొద్దీ.. చల్లదనంతో హాయిగా ఉండేదని.. అయితే గత కొన్ని ఏళ్లుగా ఏడాది ఏడాదికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దీని కారణం కోనసీమలో ఆయిల్ , గ్యాస్ తవ్వకాల పేరుతో ongc కార్యకలాపాలు, ఆక్వా సేద్యం తో చెట్లను నరికివేయడంతోనే ఎన్నడు చూడని ఉష్ణోగ్రతల నమోదవుతున్నాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: West Godavari: ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం