Ramanujacharyulu: నేటి నుంచి 5 రోజుల పాటు రామానుజుల జయంతోత్సవాలు.. చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో విశేష కైంకర్యాలు
Sri Ramanujacharya Jayanti: వెయ్యేళ్ళ క్రితమే సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి దక్షిణ భారతదేశంలో (South India) జన్మించిన గొప్ప తత్వవేత్త రామానుజ జయంతి నేడు. మేషమాసం(Mesha month)..
Sri Ramanujacharya Jayanti: వెయ్యేళ్ళ క్రితమే సమానత్వాన్ని చాటిన మానవతామూర్తి దక్షిణ భారతదేశంలో (South India) జన్మించిన గొప్ప తత్వవేత్త రామానుజ జయంతి నేడు. మేషమాసం(Mesha month) ఆరుద్రానక్షత్రంలో వైశాఖ శుద్ధ షష్టి నాడు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో జన్మించారు. నేటితో 1005 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు నుంచి మే 9వ తేదీ సోమవారం వరకూ ఐదు రోజుల పాటు రామానుజ జయంతోత్సవాలను నిర్వహించనున్నారు. రామానుజ తిరునక్షత్ర మహోత్సవంలో విశేష కైంకర్యాలను చిన జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆదిశేషుని అంశతో భువిపై జన్మించారు రామానుజులు. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకరు. 16 ఏళ్ళ వయసుకే సమస్త శాస్త్రాలను కంఠస్థం చేశారు. తల్లి కాంతిమతి నుంచి రామానుజాచార్యులు అభ్యుదయ భావాలను అలవరచుకున్నారు. అందుకే ఆయన మూఢాచారాలను వ్యతిరేకించేవారు. అంటరానితనం, ఛాందసభావాలను రూపుమాపేందుకు కృషిచేసిన మహాసంస్కర్త, భక్తి, శరణాగతి, సేవ వంటి సుగుణాలతో భగవంతుణ్ణి చేరుకోవచ్చన్న విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. రామానుజులు తన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.
విశిష్టాద్వైత మతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్నిస్థాపించారు. జీవాత్మ పరమాత్మ నుంచి వేరు కానప్పటికి ఇద్దరికి కొంత వ్యత్యాసం ఉందని విశిష్టాద్వైతం చెబుతోంది. కర్మసిద్ధాంతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యం రాశారు. అంతేకాదు అనేక రకాల ఇతర గ్రంధాలను రామానుజులు రచించారు.
తిరుమల సప్తగిరులు సాక్షాత్తు శ్రీమహా విష్ణుడు శేషతల్పం.. ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు.. తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. అందుకనే స్వామివారి దర్శనం కోసం మోకాళ్ళపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. అంతేకాదు శ్రీవారి పూజా విధానం కొరుక చక్కని వ్యవస్థను ఏర్పాటు చేశారు. తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read:Indian Railway: శ్రీరామ భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. రెండు దేశాలను కలుపుతూ ‘శ్రీ రామాయణ యాత్ర’
Hyderabad: భాగ్యనగర్ వాసులకు గుడ్ న్యూస్.. ఎంఎంటీఎస్ టికెట్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి అమల్లోకి