AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. నాలుగు రోజుల హై డ్రామాకు తెర

తిరుమల(Tirumala) బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతం అయింది. నాలుగు రోజుల హైడ్రామా తరువాత గోవర్దన్‌ ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని...

Tirumala: తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. నాలుగు రోజుల హై డ్రామాకు తెర
Kidnap Tirumala
Ganesh Mudavath
|

Updated on: May 05, 2022 | 11:12 AM

Share

తిరుమల(Tirumala) బాలుడి కిడ్నాప్‌ కేసు సుఖాంతం అయింది. నాలుగు రోజుల హైడ్రామా తరువాత గోవర్దన్‌ ఆచూకీ లభ్యమైంది. తిరుమల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో చిన్నారి క్షేమంగా ఉన్నాడు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న తిరుమల అఖిలాండం వద్ద బాలుడు కిడ్నాప్‌(Kidnap) కు గురయ్యాడు. అనంతరం బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ.. చిన్నారిని మైసూర్‌ తీసుకెళ్లింది. అక్కడ ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు గోవర్దన్ ను తీసుకెళ్లింది. చిన్నారిని ఎందుకు తీసుకొచ్చావని మహిళ తల్లిదండ్రులు ప్రశ్నించడంతో తిరుమలకు వచ్చి చిన్నారిని విజిలెన్స్‌కు పోలీసులకు అప్పగించింది. తిరుమలలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ కోసం తిరుమల పోలీసులు తమిళనాడులోనూ గాలింపు చేపట్టారు. బాలుడి అదృశ్యంపై(Missing) కేసును నమోదు చేసిన తిరుమల పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తిరుమల పోలీసు అధికారుల ఆధ్వర్యంలోని రెండు పోలీసు బృందాలు కడప, నెల్లూరు జిల్లాలోనూ గాలింపు చేపట్టగా మరో బృందం తమిళనాడులోని జోళారుపేట, కాట్పాడిలో గాలింపు చేపట్టారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. తిరుపతి దామినేడు ప్రాంతానికి చెందిన గోవర్దన్ రాయల్.. అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం సాయంత్రం 5 .45 నిమిషాలకు బాలుడి కిడ్నాప్ ఘటన జరిగింది. సైలెంట్ గా వచ్చిన ఒక మహిళ బాలుడిని ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీచదవండి

Pragya Jaiswal: మైండ్ బ్లోయింగ్ ఫోజులు మోత మోగిస్తోన్న బాలయ్య భామ.. వైరల్ అవుతున్న ప్రగ్యా లేటెస్ట్ పిక్స్

West Godavari: ఏడుపదుల వయసులోనూ బామ్మగారు ఉత్సాహంగా నృత్యం.. చూపరులకు సంతోషం

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..