AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దారుణం

ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఓ అమ్మ కూడా చేయని పని చేసింది. కన్నబిడ్డలను కని పెంచి, పెద్దవాళ్లను చేసింది. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఘోర పనికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఎలా అని ఆలోచించినట్లుంది....

Andhra Pradesh: ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని దారుణం
Fire
Ganesh Mudavath
| Edited By: Ram Naramaneni|

Updated on: May 06, 2022 | 6:57 AM

Share

ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఓ అమ్మ కూడా చేయని పని చేసింది. కన్నబిడ్డలను కని పెంచి, పెద్దవాళ్లను చేసింది. తాను విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఘోర పనికి పాల్పడింది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఎలా అని ఆలోచించినట్లుంది. తన వెంటే వారినీ తీసుకెళ్లాలనుకుంది. తనతో పాటు తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. వారందరూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తల్లీ కుమార్తె మృతి చెందగా.. మరో కుమార్తె, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో విషాదం నెలకొంది. తల్లీ, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో తల్లి చిన్నమ్మడు చిన్నకుమార్తె జాహ్నవి చనిపోయారు. పెద్ద కుమార్తె రంజని, కుమారుడు వెంకటసాయి శశాంకర్‌ కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చిన్నమ్మడు భర్త నరసింహులును విచారిస్తున్నారు. ఈ ఘటనకు కారణమేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

ఇవి కూడా చదవండి

Rahul vs KTR: నేను సిద్ధమే.. నీవు సిద్ధమా.. రాహుల్‌‌కు కేటీఆర్ వైట్‌ చాలెంజ్‌.. భాగ్యనగరంలో బ్యానర్ల పంచాయితీ!

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. వేదిక ఎక్కడంటే