KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ 2 (KGF 2) ఇప్పటికీ ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్‏ను

KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..
Kgf 2 Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: May 05, 2022 | 3:52 PM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ 2 (KGF 2) ఇప్పటికీ ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్‏ను షేక్ చేస్తుంది. విడుదలై నెల రోజులు కావస్తున్న కేజీఎఫ్ 2 హావా మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ. 1000కి పైగా కలెక్షన్లు రాబట్టి.. దేశంలోనే వెయ్యి కోట్ల వసూళ్లు చేసిన నాల్గవ చిత్రంగా నిలిచింది. దక్షిణాదిలోనే కాకుండా.. నార్త్‏లోనూ కేజీఎఫ్ 2 సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానానికి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ముగ్దులయ్యారు. అలాగే యశ్ నటనకు.. కేజీఎఫ్ 2 డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈసినిమా మరో రికార్డ్ బ్రేక్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ 2 సినిమా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన 2వ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా బుధవారం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 8.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తం ఇప్పటివరకు రూ. 391 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్, దంగల్ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన కేజీఎఫ్ ఇక బాహుబలి సినిమా 2 మాత్రమే పెండింగ్ ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ కీలకపాత్రలలో నటించిన హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Yashoda: ఆకట్టుకుంటున్న యశోద మూవీ ఫస్ట్ గ్లింప్స్.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’లో ఆ రెండు పాటల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal : షాకింగ్ నిర్ణయం తీసుకున్న చందమామ కాజల్.. షాక్ లో అభిమానులు.

Ram Charan House: ఆధునిక సౌకర్యాలు, సాంప్రదాయానికి నెలవుగా రామ్ చరణ్ విలాసవంతమైన భవనం.