Sarkaruvaari Paata: ఆర్‌ఆర్ఆర్, కేజీఎఫ్2 బాటలోనే సర్కారు వారి పాట.. మహేశ్ సినిమా ఎంతసేపు ఉండనుందంటే..
Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారువారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్త సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది
Mahesh Babu: సరిలేరు నీకెవ్వరు తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు సర్కారువారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. గీత గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్త సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో వారం రోజుల్లో (మే12)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్ మహేశ్ ఫ్యాన్స్‌తో పాటు సామాన్య సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మే 7న హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కాగా ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2, ఆచార్య మాదిరిగానే సర్కారువారిపాట (Sarkaruvaari Paata) సినిమాకు కూడాభారీగానే రన్ టైమ్ ఫిక్స్ చేశారట.
తాజా సమాచారం ప్రకారం SVP చిత్రానికి 163 నిమిషాల రన్ టైమ్‌ను సెట్ చేశారట మేకర్స్. అంటే సుమారు 2 గంటల 43 నిమిషాలు. కాగా సినిమాలో మంచి కంటెంట్ ఉండుంటే భారీ రన్‌టైమ్ పెద్ద విషయమేమీ కాదని ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2 సినిమాలు నిరూపించాయి. ఈక్రమంలో మహేశ్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు చెబుతున్నారు. బ్యాకింగ్ రంగంలో జరిగిన ఓ స్కామ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్ లోన్ కలెక్షన్ ఏజెంట్‌గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో నదియా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్, మహేశ్ మంజ్రేకర్, రవిప్రకాశ్, తనికెళ్ల భరణి, అజయ్, సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. తమన్ అందించిన బాణీలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. మరి భారీ క్యాస్టింగ్, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తోన్న సర్కారు వారి పాట ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
HUL News: సామాన్యులకు మరో షాక్.. మరోసారి సోపులు, షాంపుల రేట్లు 15 శాతం పెంచిన హిందుస్థాన్ సంస్థ..
Rajya Sabha Poll: తెలంగాణలో మోగిన మరో ఎన్నిక నగారా.. మే 30వ తేదీన పోలింగ్