Rajya Sabha Poll: తెలంగాణలో మోగిన మరో ఎన్నిక నగారా.. మే 30వ తేదీన పోలింగ్
తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Elections Results
Rajya Sabha Poll in Telangana: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 30వ తేదీన పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంటు సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
రాజ్యసభ ఎన్నిక షెడ్యూల్ ఇదే..
- మే 12న నోటిఫికేషన్.
- మే 19న నామినేషన్లకు చివరి తేదీ.
- మే 30న పోలింగ్.. అనంతరం ఓట్ల లెక్కింపు.
