Ponguleti Srinivas Reddy: గులాబీ దళంలో పెరుగుతున్న రెబల్స్ బెడద.. కాంగ్రెస్ వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూపు!

తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగ తగులుతోంది. టీఆర్ఎస్ నేతలు ఎంత కాదనుకుంటున్నా రోజురోజూకీ గళమెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

Ponguleti Srinivas Reddy: గులాబీ దళంలో పెరుగుతున్న రెబల్స్ బెడద.. కాంగ్రెస్ వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూపు!
Ponguleti Srinivas Reddy
Follow us

|

Updated on: May 05, 2022 | 1:08 PM

Ex MP Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగ తగులుతోంది. టీఆర్ఎస్ నేతలు ఎంత కాదనుకుంటున్నా రోజురోజూకీ గళమెత్తుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. దిగ్గజ నేతలంతా అధికార పార్టీలో ఉంటూనే అసమ్మతి గళం వినిపిస్తున్నారు. మొన్నటివరకూ మంత్రి పదవులు రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉండగా.. ఇప్పుడు మాజీలు మౌన పోరాటం అందుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఇంటిపోరుతో ఇబ్బందిపడుతున్న పలువురు మాజీలను కాంగ్రెస్ బీజేపీలు తమవైపు లాక్కునే పనిలో పడ్డాయి.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగ రాజుకుంటుంది. కేబినెట్ బెర్త్ దక్కనివారితో పాటు పార్టీలో గుర్తింపు లేని ముఖ్యనేతలు అసమ్మతి రాగం అందుకుంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన కొందరు ముఖ్య నేతల నుంచే టీఆర్ఎస్‌కు తలనొప్పులు మొదలయ్యాయి. వీళ్లలో కొందరు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారనే ప్రచారం సాగుతోంది.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రెబల్స్ బెడద తీవ్రంగా ఉంది. గత కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయిన తుమ్మల ప్రస్తుతం పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఇక మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు సొంతపార్టీపైనే వ్యతిరేక గళమెత్తుతున్నారు. అధిష్టాన ధిక్కార స్వరం పెంచుతుండటం చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఈ ముగ్గురు నేతలు ఖమ్మంలో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి ప్రజాక్షేత్రంలో ఉంటూ తన కార్యాచరణ అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. త్వరలో కారు వదిలి చేయిని అందుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అన్ని కుదిరితే రేపు వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే, పార్టీకి ద్రోహం చేస్తున్న శత్రువులు పార్టీలోనే ఉన్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సీనియర్లను అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆవేదన పొంగులేటి లో ఉంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ లో టికెట్ వచ్చినా రాకున్నా తమ దారి తాము చూసుకునేందుకు ఈ నేతలు రెడీ అయినట్లు సమాచారం.

ఇక ఈ ముగ్గురే కాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పిడమర్తి రవి, తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు సైతం అడపా దడపా సొంత పార్టీపై అసమ్మతి రాగం వినిపిస్తూనే ఉన్నారు. వీరి స్థానంలో వేరొకరు రావడం.. వారు వీరిని కాదని అధికారాన్ని అనుభవిస్తుండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఓవర్ లోడ్ తో సాగుతున్న టీఆర్ఎస్ లో వచ్చే ఎన్నికల నాటికి చాలా మంది చేజారే చాన్స్ కనిపిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బయట నుంచి వచ్చిన నేతలు కొత్త వారితో టీఆర్ఎస్ టైట్ అయ్యింది. మరింత మంది కారు దిగిపోయే ప్రమాదం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.