Viral Video: గెలవాలంటే ఆ రెండూ అవసరం అని చాటిచెప్పిన బుడ్డోడు.. వీడియో చూస్తే సెల్యూట్ చేస్తారు..!
Viral Video: కుందేలు, తాబేలు కథ గురించి మనందరికీ తెలిసిందే. పరుగెత్తడం రాదని ఎగతాళి చేసిన కుందేళుకు అదే పరుగుపందెంలో తాను గెలిచి సత్తా..
Viral Video: కుందేలు, తాబేలు కథ గురించి మనందరికీ తెలిసిందే. పరుగెత్తడం రాదని ఎగతాళి చేసిన కుందేళుకు అదే పరుగుపందెంలో తాను గెలిచి సత్తా చాటింది తాబేలు. దీని ఆధారంగా.. జీవితంలో గెలవాలంటే ఎవరికైనా ఓర్పు, సహనం ముఖ్యం అని పెద్దలు చెబుతుంటారు. ఇలాంటి సన్నివేశాన్ని నిదర్శనమైన ఘటన మరోసారి వెలుగు చూసింది. ఓ చిన్నోడి విజయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి శభాష్ చిన్నోడా అంటూ మెచ్చుకుంటున్నాడు. ఎదుటివారు ఎంత ఆవేశపడినా.. సహనం, ఓర్పు, తెలివితో ఆట గెలిచి అందరినీ అబ్బురపరిచాడు. ఆ చిన్నోడి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది.
అవును.. కొన్నిసార్లు గెలవడానికి ఓపిక అవసరం. ఆవేశంతో పరుగెత్తిన వాడు గెలుస్తాడనే విశ్వాసం లేదు. ఈ వీడియోనే అందుకు సాక్షంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో నలుగురు పిల్లలతో లెమన్ రేస్ నిర్వహించారు. అంటే నోట్లో స్పూన్ పెట్టుకుని.. ఆ స్పూన్‌లో పెట్టిన లెమన్‌ను కింద పడకుండా టార్గెట్ చేరాలి. అలా చేరితే విజయం సాధించినట్లు.. లేదంటే ఓడిపోయినట్లు. ఈ గేమ్‌లో నలుగురు పిల్లలు పాల్గొనగా.. అందులో ముగ్గురు పిల్లలు గెలవాలనే ఉత్సాహంతో హడావుడిగా పరుగెత్తారు. కానీ, ఒక్క పిల్లాడు మాత్రం నిదానంగా, జాగ్రత్తగా ముందుకు నడుస్తూ సాగాడు. ముందు నడిచిన ముగ్గురు చిన్నారు గమ్యం చేరకుండానే ఓడిపోగా.. వెనకబడిన ఆ పిల్లాడు మాత్రం నిమ్మకాయ కిందపడకుండా జాగ్రత్తగా నడిచి విజయాన్ని సాధించాడు. ఈ గేమ్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. పిల్లాడి ఓపిక, నేర్పును చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 30 లక్షల మందికిపైగా వీక్షించారు. అంతే స్థాయిలో లైక్స్ కూడా వచ్చాయి. అందుకే.. లక్ష్య సాధనలో ఓర్పు, సహనం ముఖ్యం అని పెద్దలు చెబుతారంటూ గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
Slow and steady wins the race~Aesop
— Tansu YEĞEN (@TansuYegen) May 3, 2022