Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వరుడు చేసిన ఆ తప్పుతో పెళ్లే వద్దన్న వధువు.. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు..!

Viral News: పెళ్లి చేసుకుని వధువుతో రావాల్సిన వరుడు, అతని కుటుంబ సభ్యులంతా బిక్క మొహాలేసుకుని సైలెంట్‌గా తిరిగి స్వగృహానికి వచ్చేశారు.

Viral News: వరుడు చేసిన ఆ తప్పుతో పెళ్లే వద్దన్న వధువు.. ఆ తరువాత సీన్ మామూలుగా లేదు..!
Marraige
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2022 | 6:30 AM

Viral News: పెళ్లి చేసుకుని వధువుతో రావాల్సిన వరుడు, అతని కుటుంబ సభ్యులంతా బిక్క మొహాలేసుకుని సైలెంట్‌గా తిరిగి స్వగృహానికి వచ్చేశారు. పెళ్లి సంగతి ఏమైందంటే.. ఏవేవో సాకులు చెబుతూ వచ్చారు. మ్యాటర్ ఏంటా అని ఆరా తీస్తే షాకింగ్ విషయం వెలుగు చూసి సదరు పెళ్లి కొడుకు గ్రామస్తులు అవాక్కయ్యారు. పెళ్లి కొడుకు చేసిన తప్పు కారణంగా.. అతని మొహం మీదే ఇలాంటి పెళ్లి కొడుకు నాకు వద్దూ అని తెగేసి చెప్పిందట ఆ పెళ్లి కూతురు. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడు? పెళ్లి కూతురు అంతలా ఛీత్కరించడానికి గల కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

బీహార్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వరుడు చేసిన సిగ్గుమాలిన పనికి వివాహంతో ఒక్కటవ్వాల్సిన బంధం పెళ్లి పీటలపైనే పట్టుమని తెగిపోయింది. సాధారణంగా పెళ్లి వేడుకలో సంతోషంతో పాటు.. కొన్ని కొన్నిసార్లు వరుడు, వధువు కుటుంబాల వైపు ఉండే పట్టింపుల కారణంగా ఘర్షణలు జరుగుతుంటాయి. అయితే, ఇక్కడ అలాంటి పట్టింపుల వల్ల ఘర్షణలు చోటు చేసుకోలేదు. కానీ, పెళ్లి కొడుకు చేసిన చిల్లర పని వల్ల ఆ పెళ్లి నిలిచిపోయింది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది మంచిదే అని చెప్పుకోవాలి. ప్రస్తుత కాలంలో ఆడవారు అన్ని అంశాల్లోనూ తమ లైఫ్ సెక్యూర్ చూసుకుంటారు. తాను కట్టుకోబోయే భర్త.. అన్ని అంశాల్లో సరైనవారేనా? లేదా? అనే అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

తాజాగా అర్వాల్ జిల్లాలోని మెహందియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో యువతి, యువకుడికి వివాహ నిశ్చర్యమైంది. పెళ్లి కోసం అంతా సిద్ధం చేశారు. పెళ్లి వేదిక వద్దకు అటు నుంచి పెళ్లి కూతురు, ఇటు నుంచి పెళ్లి కొడుకు ఊరేగింపుగా వచ్చారు. అక్కడే అసలు మ్యాటర్ వెలుగు చూసింది. వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ విషయాన్ని గమనించిన వధువుకు కోపం నశాలానికి ఎక్కింది. వెంటనే వరుడి మెడలో ఉన్న పూల దండను నేలకేసి కొట్టింది. అతనితో పెళ్లికి నిరాకరించింది. తాగుబోతును పెళ్లి చేసుకోను అంటూ వేదికపై నుంచి కిందకు దిగింది. పెళ్లికి వచ్చిన అతిథులు సైతం ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించగా.. ససేమిరా అంది. పైగా పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు పెళ్లి వేదిక వద్దకు రాగా.. విషయం పూసగుచ్చినట్లు వివరించి తనకు అలాంటి భర్త వద్దంటే వద్దంటూ తేల్చి చెప్పింది. ఇక చేసేదేమీ లేక వరుడు, అతని కుటుంబ సభ్యులు వెనుదిరిగి వచ్చారు.

పదో తరగతి విద్యార్ధులకు 2025 బిగ్‌షాక్.. ఫలితాలు మరింత ఆలస్యం..?
పదో తరగతి విద్యార్ధులకు 2025 బిగ్‌షాక్.. ఫలితాలు మరింత ఆలస్యం..?
తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
తమన్నా సినిమాకు ప్రీమియర్లు లేవ్..
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జగన్నాథుడు దర్శనం తర్వాత భక్తులు మూడోమెట్టుపై అడుగుపెట్టరో తెలుసా
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
జేఈఈ మెయిన్‌ 2025 తుది ర్యాంకుల విడుదల నేడే.. డైరెక్ట్ లింక్ ఇదే
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
వ్యక్తిగతంగా ఇబ్బందిపడుతున్నానన్న నజ్రియా.. రియాక్ట్ అయిన సమంత
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
టైమ్ మెషీన్ కావాలా నాయనా.. 1959లో 10 గ్రాములు బంగారం ధర ఎంతంటే..?
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసా
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నా ఫ్యామిలీ ప్రెజర్ చేస్తున్నారు..
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
నేడు, రేపు చిరుజల్లులు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి
పరుగులు తీస్తున్న పుత్తడి.. అదే బాటలో పయనిస్తున్న వెండి