Hair Care: 20 ఏళ్లకే జుట్టు తెల్లబడుతుందా.. మీరు ఈ లోపం గురించి తెలుసుకోవాల్సిందే..!
Hair Care: నేటి కాలంలో 20 ఏళ్లు నిండకముందే జుట్టు నెరిసిపోతుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడ్డ అలవాట్లు ,
Hair Care: నేటి కాలంలో 20 ఏళ్లు నిండకముందే జుట్టు నెరిసిపోతుంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడ్డ అలవాట్లు , ఆహార పద్దతుల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. వాస్తవానికి మన జుట్టులో మెలనిన్ ఉంటుంది. ఇది జుట్టుని నలుపు రంగులో ఉంచడానికి సహాయం చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ కణాలు క్షీణిస్తాయి. అప్పుడు జుట్టు తెల్లగా మారడం మొదలవుతుంది. కానీ ఆ కణాలు ఇప్పుడు చిన్నవయసులోనే క్షీణించడం వల్ల జుట్టు నెరిసిపోతుంది. ఇలా జరగకూడదంటే మెలనిన్ కంటెంట్ తగ్గకుండా చూసుకోవడం మంచిది. ఇలా జరగకూడదంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రత్యేక డైట్ మెయింటెన్ చేయాలి. వాటి గురించి తెలుసుకుందాం.
సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలో విటమిన్ డి, బి12, ఈ, విటమిన్ ఎ ఉంటాయి. ఇవి జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. మీరు మీ ఆహారంలో సిట్రస్ పండ్లను ఉండేలా చూసుకోవాలి. నారింజ, నిమ్మకాయలలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
కూరగాయలు: కూరగాయలలో కాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ, పాలకూరలలో మెలనిన్ ఉత్పత్తి చేసే పోషకాలు ఉంటాయి. మీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మీ జుట్టుకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.
డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ యాంటీఆక్సిడెంట్స్‌కి గొప్ప మూలం. ఇది శరీరంలో చనిపోయిన, దెబ్బతిన్న కణాల పెరుగుదలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది జుట్టులో ఆరోగ్యకరమైన మెలనిన్ స్థాయిల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
బెర్రీలు: బెర్రీలు, స్ట్రాబెర్రీలు మొదలైన వాటిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న కణాలని బాగు చేస్తాయి. అంతేకాకుండా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
అధిక వేడి జుట్టులో మెలనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు తెల్లగా మారుతుంది.
ధూమపానం: ధూమపానం శరీరంపై వివిధ ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. అధిక ధూమపానం తలకు రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఇది జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నిజానికి ధూమపానం వల్ల జుట్టు తెల్లబడుతుంది.
మానసిక ఒత్తిడి: మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి రుగ్మతల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల నిద్రలేమి, ఆకలి లేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి. ఇవి శరీరంపై చెడు ప్రభావం చూపి జుట్టు తెల్లబడేలా చేస్తాయి.
విటమిన్ లోపం: జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్త కణాలను నిలుపుకోవటానికి శరీరానికి విటమిన్ B12 అవసరం. శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందేలా చూసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.