AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: తల్లి ఇళ్లల్లో బట్టలు ఉతికి కష్టపడి పెంచింది.. ఇప్పుడు కొడుకు గొప్ప క్రికెటర్..!

IPL 2022: ఒంటరి మహిళ, శిథిలావస్థలో ఇల్లు, తినడానికి తిండి లేని పరిస్థితి.. ఇలాంటి పేదరికంలో ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ

IPL 2022: తల్లి ఇళ్లల్లో బట్టలు ఉతికి కష్టపడి పెంచింది.. ఇప్పుడు కొడుకు గొప్ప క్రికెటర్..!
Rovman Powells
uppula Raju
|

Updated on: May 06, 2022 | 11:50 AM

Share

IPL 2022: ఒంటరి మహిళ, శిథిలావస్థలో ఇల్లు, తినడానికి తిండి లేని పరిస్థితి.. ఇలాంటి పేదరికంలో ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆ తల్లి పిల్లల కోసం చాలా కష్టపడింది. ఇతరుల ఇళ్లలో బట్టలు ఉతికి పిల్లల్ని పోషించింది. తన తల్లి కష్టాలని చూసిన కొడుకు చలించిపోయాడు. పేదరికం నుంచి బయటపడేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పుడు గొప్ప క్రికెటర్‌గా మారి మాట నిలబెట్టుకున్నాడు. అతడు ఎవరో కాదు ఐపీఎల్‌ ఢిల్లీ తరపున ఆడుతున్న వెస్టిండిస్ క్రికెటర్ రోవ్‌మన్‌ పావెల్‌. కరేబియన్ ప్రీమియర్ లీగ్ రూపొందించిన డాక్యుమెంటరీలో రోవ్‌మన్ పావెల్ తన తల్లి గురించి ఈ విషయాలు చెప్పాడు. పావెల్ మాట్లాడుతూ “ నేను మైదానంలో కష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఇదంతా నా తల్లి కోసం చేస్తున్నాను, నా చెల్లి కోసం చెస్తున్నాను, నేను ప్రేమించేవాళ్లకోసం చేస్తున్నానని అనుకుంటాను. నా చిన్నతనంలో చూసిన రోజులు మళ్లీ చూడకూడదని, నా తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని మనసులో గట్టిగా అనుకోని ఆడతానని” చెప్పాడు.

పొవెల్‌ జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020 సీజన్‌ సమయంలో డాక్యుమెంటరీ ద్వారా అందరికి తెలియజేశారు. ఇక పొవెల్‌ కెరీర్‌ విషయానికొస్తే.. 2016లో శ్రీలంకతో జరిగిన వన్డేతో వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది పాకిస్థాన్‌తో సిరీస్‌తో టీ20 ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టాడు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన పొవెల్.. ఐపీఎల్‌ 2022 సీజన్ మెగా వేలంలో రూ. 2.8 కోట్ల భారీ ధర పలికాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మెగా వేలానికి ముందు భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో పొవెల్ రాణించడం అతనికి కలిసొచ్చింది.

పొవెల్‌ 1993, జూలై 23న జమైకాలోని ఓ మారుమూల ప్రాంతంలో జన్మించాడు. అతని తల్లి సింగిల్‌ పేరెంట్‌. పావెల్‌తో పాటు ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరు పిల్లల పోషణ బాధ్యతను తలకెత్తుకున్న ఆమె.. ఎన్నో కష్టాలు పడుతూ వారిని పెద్ద చేసింది. చిన్న ఇంట్లో తల్లి ఇబ్బందులు చూస్తూ పెరిగిన పొవెల్‌.. ఆమె ప్రశాంత జీవితం గడిపేలా అన్ని సౌకర్యాలు ఉన్న జీవితం అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దానికి తగ్గట్లుగానే చిన్ననాటి నుంచే క్రికెటర్‌ కావాలన్న తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mothers Day 2022: తల్లి అయిన తర్వాత మహిళలకి ప్రసూతి సెలవులు ఎన్ని రోజులు లభిస్తాయో తెలుసా..?

IPL 2022 Orange Cap: బట్లర్‌, రాహుల్‌కి పొంచి ఉన్న ముప్పు.. డేవిడ్‌ వార్నర్‌ రేసులోకి వచ్చేశాడుగా..!

NEET UG 2022 పరీక్ష వాయిదా పడుతుందా.. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఏంటో తెలుసుకోండి..!