AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bill Gates: కరోనా తర్వాత ఇప్పుడు మరో మహమ్మారి.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరిక..!

Bill Gates: ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటోంది. నష్టాల బారి నుంచి కంపెనీలు కొంచెం కొంచెం కోలుకుంటున్నాయి. ఇలాంటి

Bill Gates: కరోనా తర్వాత ఇప్పుడు మరో మహమ్మారి.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ హెచ్చరిక..!
Bill Gates
uppula Raju
|

Updated on: May 06, 2022 | 1:57 PM

Share

Bill Gates: ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటోంది. నష్టాల బారి నుంచి కంపెనీలు కొంచెం కొంచెం కోలుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ మరో హెచ్చరికను జారీ చేశారు. రాబోయే 20 ఏళ్లలో మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దీనిని ఎదుర్కోవడానికి అందరు సిద్దంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కరోనా వైరస్‌ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యాధికారక వైరస్‌ల నుంచి వచ్చే అవకాశముందని తెలిపారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మాటలు మాట్లాడారు.

‘‘గత రెండేళ్లుగా కరోనా వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో కరోనా కొంచెం తగ్గుముఖం పట్టింది. చాలా మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరగడంతో కొత్త వేరియంట్‌ను తట్టుకోగలిగాం. అయితే కరోనా తగ్గుతున్నప్పటికీ.. ప్రపంచంపై మరో మహమ్మారి విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. ఇది బహుశా.. కరోనా కుటుంబం నుంచి గాక, వేరే వైరస్‌ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులు, ఒబెసిటీ, డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.’’ అని చెప్పారు.

కరోనా వైరస్‌ వల్ల అభివృద్ధి చెందిన యాంటీబాడీల కారణంగా కొత్త మహమ్మారి నుంచి బయటపడగలమని గేట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వైద్యరంగంలో అందుబాటులోకి వస్తోన్న అధునాతన సాంకేతికత.. ఈ మహమ్మారిపై పోరాటానికి దోహదపడుతుందని బిల్‌గెట్స్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్‌లో సమస్యలతో పాటు అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. గ్లోబల్ ఎపిడెమిక్ రెస్పాన్స్ మొబిలైజేషన్ (GERM) బృందాన్ని ఏర్పాటు చేయాలని గేట్స్ ప్రతిపాదించారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్వహించాలన్నారు. ఇది ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని బిల్‌గేట్స్ కోరారు.

మరిన్ని ప్రపంచ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Health Tips: క్యాన్సర్‌ రావొద్దంటే ఈ ఆహారాలకి దూరం ఉండాలి.. అవేంటంటే..?

Health Tips: మోకాళ్ల నొప్పిని తట్టుకోలేకపోతున్నారా.. ఈ 5 ఆహారాలని డైట్‌లో చేర్చండి..!

Health Tips: ఉదయాన్నే చేసే ఇలాంటి పొరపాట్లు ఎసిడీటీకి కారణమవుతాయి.. అవేంటంటే..?