IPL 2022: మళ్లీ మిస్ అయింది.. పదోసారి టాస్ ఓడిపోయిన సంజూ శాంసన్..!..
IPL 2022: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే కెప్టెన్
IPL 2022: ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్ అదృష్టం మాత్రం మారడంలేదు. అతడు పరుగులు చేయడంలో విజయవంతమవుతున్నాడు కానీ టాస్‌లో పరాజయం పాలవుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ మరోసారి టాస్ ఓడిపోయాడు. ఇది అతడికి అలవాటుగా మారిపోయింది. ఈ సీజన్‌లో సంజు శాంసన్ గరిష్టంగా 10 టాస్‌లను కోల్పోయాడు. ఇప్పటివరకు సంజూ శాంసన్ ఒక్క టాస్ మాత్రమే గెలిచాడు. అయితే ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఏ కెప్టెన్ ఎన్ని సార్లు టాస్ గెలిచాడో తెలుసుకుందాం.
1. ఐపీఎల్ 2022లో అత్యధిక టాస్ గెలిచిన ఆటగాడు కేన్ విలియమ్సన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ టాస్ విన్ శాతం 90 శాతం. 10మ్యాచ్‌లలో దాదాపు 9 టాస్‌లు గెలిచాడు.
2. టాస్ గెలిచిన విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో ఉన్నాడు. పాండ్యా 11 టాస్‌లలో 7 గెలిచాడు. అతను 4 టాస్‌లని కోల్పోయాడు. అతని టాస్ విన్ శాతం 65 శాతం.
3. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 10 టాస్‌లకు గాను 6 గెలిచారు.
4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 11 టాస్‌లలో 6 గెలిచాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 10 మ్యాచ్‌ల్లో 5-5తో విజయం సాధించారు.
5. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున జడేజా, ధోనీలు కలిసి 10 టాస్‌లకు గాను 4 గెలిచారు. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 11 టాస్‌లకు గాను 3 గెలిచాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి