Watch Video: చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ.. హీరోగా మారిన విలన్.. ఆ రూ.2.60 కోట్ల బౌలర్ ఎవరంటే?

ముంబై ఇండియన్స్ (MI) విజయంలో హీరోగా మారిన డేనియల్ సామ్స్.. చివరి ఓవర్లో కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ డేనియల్ సామ్స్‌‌ను రూ.2.60 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది.

Watch Video: చివరి ఓవర్‌లో థ్రిల్లింగ్ విక్టరీ.. హీరోగా మారిన విలన్.. ఆ రూ.2.60 కోట్ల బౌలర్ ఎవరంటే?
Ipl 2022 Daniel Sams
Follow us
Venkata Chari

|

Updated on: May 07, 2022 | 3:50 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) 2022లో ముంబై ఇండియన్స్ (MI) రెండో విజయం సాధించింది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఐదు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ (GT)పై విజయం సాధించింది. ఇంతటి విజయం సాధించినా రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు డేనియల్ సామ్స్‌తో ముంబై విజయం కీలకపాత్ర పోషించి, హీరోగా మారాడు. ఆ చివరి ఓవర్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 9 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో ఆరు వికెట్లు మిగిలి ఉన్నాయి. తొలి బంతికే డేవిడ్ మిల్లర్ సింగిల్ తీశాడు. దీంతో ఆ ఓవర్ రెండో బంతికి రాహుల్ తెవాటియా పరుగులేమీ చేయలేకపోయాడు.

Also Read: IPL 2022: గుజరాత్‌ ఓటమిలో ఆ బౌలర్‌దే కీలక పాత్ర.. ప్లాన్ చేసి ఓడించిన రోహిత్ సేన.. ఆ ప్లేయర్ ఎవరంటే?

చివరి బంతికి ఆరు పరుగులు..

ఇవి కూడా చదవండి

ఇప్పుడు తెవాటియా భారీ షాట్ ఆడతాడని గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆశించారు. కానీ, అతను రెండవ పరుగును తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. కొత్త బ్యాట్స్‌మెన్ రషీద్ ఖాన్ ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి మిల్లర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాత గుజరాత్‌కు 2 బంతుల్లో 6 పరుగులు కావాలి. ఆ ఓవర్ ఐదో బంతికి మిల్లర్ షాట్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత గుజరాత్ విజయానికి ఆరు పరగులు కావాల్సి ఉంది. చివరి బంతికి సిక్సర్‌ కొట్టాల్సిన మిల్లర్.. ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. దీంతో ముంబై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

డేనియల్ సామ్స్ వేసిన 20వ ఓవర్:

తొలి బంతి-1 పరుగు

రెండో బంతి- నో రన్స్

మూడో బంతి-1 పరుగు+ ఒక వికెట్

నాలుగో బంతి- 1 పరుగు

ఐదో బంతి- నో రన్స్

ఆరో బంతి- నో రన్స్

డేవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 45, రోహిత్ శర్మ 43 పరుగులు చేశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టిమ్ డేవిడ్ కూడా 44 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా అత్యధికంగా 55 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, శుభ్‌మన్ గిల్ కూడా 52 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున మురుగన్ అశ్విన్ మూడు, కీరన్ పొలార్డ్ ఒక వికెట్ తీశారు.

రూ. 2.60 కోట్లకు సామ్స్‌ను దక్కించుకున్న ముంబై..

IPL 2022 మెగా వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డేనియల్ సామ్స్‌ను ముంబై ఇండియన్స్ (MI) రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చివరి సీజన్‌లో అతను RCBలో భాగమయ్యాడు. సామ్స్ ఇప్పటి వరకు 12 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

Also Read: MI Vs GT: ఉత్కంఠ పోరులో రోహిత్‌ సేన విజయం.. 5 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపు..

PBKS vs RR Live Score, IPL 2022: రాజస్థాన్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన పంజాబ్‌..