MI Vs GT: ఉత్కంఠ పోరులో రోహిత్‌ సేన విజయం.. 5 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపు..

ముంబై ఇండియన్స్(MI) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ముంబైనే విజయం వరిచింది. ఐపీఎల్‌ 2022(IPL)లో భాగంగా ముంబైలోని..

MI Vs GT: ఉత్కంఠ పోరులో రోహిత్‌ సేన విజయం.. 5 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపు..
Mi
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 07, 2022 | 12:00 AM

ముంబై ఇండియన్స్(MI) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో ముంబైనే విజయం వరిచింది. ఐపీఎల్‌ 2022(IPL)లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌లో రాణించారు. ఇషాన్‌ కిషన్‌ 29 బంతుల్లో 45 పరుగులు చేశాడు. రోహిత్‌ శర్మ 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివర్లో టిమ్‌ డెవిడ్‌ మెరుపు ఇన్సింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో సూర్యకుమార్‌ యాదవ్ 13, తిలక్‌ వర్మ 21, పోలార్డ్ 4 పరుగులు చేయగా డానియల్‌ సామ్స్‌ డకౌంట్‌ అయ్యాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోసెఫ్, ఫర్గ్‌సన్‌, సంగ్వాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన గుజరాత్‌ ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఇద్దరు బౌండరీలతో అలరించారు. వృద్ధిమాన్‌ సాహా, శుభ్‌మన్‌ గిల్‌ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో ముంబైకి మరో ఓటమి తప్పదనుకున్నారంతా.. కానీ.. ఓపెనింగ్‌ జోడిని స్పిన్నర్ మురగన్‌ అశ్విన్ విడగొట్టారు. మురుగన్‌ బౌలింగ్‌లో 52 పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ ఔటయ్యాడు. 55 పరుగులు చేసిన సాహాను మురుగన్ అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్, పాండ్యా ఔటయ్యారు. గుజరాత్‌కు చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సి ఉండగా కేవలం మూడు పరుగులే చేశారు. దీంతో ముంబై విజయం ఖాయమైంది. గుజరాత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్‌ 2, పోలార్డ్ ఒక్క వికెట్ పడగొట్టారు.

Read Also.. Watch Video: ఒకే ఓవర్లో 5 సిక్సులు, ఒక ఫోర్.. 64 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. బౌలర్లను ఉతికారేసిన ప్లేయర్..