Watch Video: ఒకే ఓవర్లో 5 సిక్సులు, ఒక ఫోర్.. 64 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. బౌలర్లను ఉతికారేసిన ప్లేయర్..

బెన్ స్టోక్స్ గత నెలలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జూన్‌లో జట్టుకు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే అంతకు ముందు అతను మిగిలిన ఆటగాళ్ల మాదిరిగానే కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉన్నాడు.

Watch Video: ఒకే ఓవర్లో 5 సిక్సులు, ఒక ఫోర్.. 64 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ..  బౌలర్లను ఉతికారేసిన ప్లేయర్..
English County Championship 2022 Ben Stokes
Follow us

|

Updated on: May 06, 2022 | 10:03 PM

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు(England Cricket Team)లో మార్పులు సమయం ఆసన్నమైంది. గత ఏడాదిన్నర కాలంగా టెస్టు ఫార్మాట్‌లో జట్టు వైఫల్యం, పేలవమైన పరిస్థితి తర్వాత, కెప్టెన్సీ నుంచి కోచింగ్ వరకు మార్పులు చేసింది. ఈ మార్పు తర్వాత, ప్రస్తుత కాలంలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరైన బెన్ స్టోక్స్(Ben Stokes) చేతుల్లోకి జట్టు కమాండ్ చేరింది. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆ ఆల్ రౌండర్.. ప్రస్తుతం కెప్టెన్సీలో కొత్త శిఖరాలను తాకేందుకు సిద్ధమవుతున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు ముందు, తనను తాను మరోసారి నిరూపించుకోవాలిన ఆశపడ్డాడు. ఇందుకోసం కౌంటీ ఛాంపియన్‌షిప్ (English County Championship 2022)ని ఎంచుకున్నాడు. ఈ మేరకు బౌలర్లను ఈ ఛాంపియన్ షిప్‌లో దారునంగా దెబ్బతీశాడు. డర్హామ్ తరపున ఆడుతూ, స్టోక్స్ కేవలం 64 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఒక ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు, ఒక ఫోర్ బాదేసి, తన సత్తా చాటాడు.

ఈ ఏడాది ప్రారంభంలో యాషెస్‌లో ఓటమి, ఆపై మార్చిలో వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ సిరీస్ వైఫల్యం, ఇంగ్లాండ్ క్రికెట్‌లో కీలక మార్పులకు కారణమైంది. దీంతో కొంతకాలంగా ఇంగ్లీష్ జట్టు దూరంగా ఉన్న బెన్ స్టోక్స్ తిరిగి ఎంపికయ్యాడు. స్టోక్స్ జట్టు ప్రదర్శనను మెరుగుపరచడమే కాకుండా బ్యాట్, బాల్‌తో మంచి ఆటను ప్రదర్శించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకే కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధమయ్యాడు.

సిక్సర్ల వర్షం, ఫాస్టెస్ట్ సెంచరీ..

సుమారు నెలన్నర తర్వాత మొదటిసారి మైదానంలోకి అడుగుపెట్టిన స్టోక్స్.. మే 6 శుక్రవారం తన కౌంటీ క్లబ్ డర్హామ్ కోసం వోర్సెస్టర్‌షైర్‌పై ఆశ్చర్యకరమైన ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తన సన్నాహాలను ప్రారంభించాడు. రెండో రోజు మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన స్టోక్స్.. వచ్చిన వెంటనే వూస్టర్ బౌలర్లపై సత్తా చాటాడు. ఆ తర్వాత ఎడమచేతి వాటం స్పిన్నర్ జోష్ బేకర్ వేసిన ఇన్నింగ్స్ 117వ ఓవర్‌లో చుక్కలు చూపించాడు.

ఈ సమయంలో స్టోక్స్ 70 పరుగులతో ఆడుతున్నాడు. ఇక్కడి నుంచి ఓవర్ తొలి ఐదు బంతుల్లో సిక్సర్ల వర్షం కురిపించిన స్టోక్స్.. కేవలం 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డర్హామ్ కౌంటీ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీని పూర్తి చేశాడు.

6వ సిక్సర్ మిస్..

స్టోక్స్‌ చేసిన ఈ దాడితో బౌలర్ అవాక్కయ్యాడు. వరుసగా 6 సిక్సర్లు కొట్టేలా కనిపించిన స్టోక్స్.. చివరి బంతిని కూడా గాలిలో లేపాడు. కానీ, అది కేవలం కొద్ది తేడాతో బౌండరీ ఇవతల పడింది. దీంతో నాలుగు పరుగులు వచ్చాయి. ఈ విధంగా అతను ఈ ఓవర్లో 34 పరుగులు పిండుకున్నాడు. అయితే, స్టోక్స్ ఇక్కడితో ఆగలేదు. తర్వాతి ఓవర్‌లో స్ట్రైక్‌కి వచ్చిన వెంటనే జాక్ లీచ్‌పై వరుసగా రెండు సిక్సర్లు కూడా బాదాడు. ఈ విధంగా స్టోక్స్ వరుసగా 8 బంతుల్లో 7 సిక్సర్లు, 1 ఫోర్ బాదాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: GT vs MI Live Score, IPL 2022: దంచి కొడుతోన్న గుజరాత్ ఓపెనర్స్.. స్కోరెంతంటే?

Watch Video: ఇదేం షాట్ మావా.. ఇలాక్కూడా కొడతారా.. వార్నర్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాంకే.. వైరల్ వీడియో..